Ram Charan
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ఇక హాలీవుడ్ లో చరణ్ పేరు గట్టిగా వినిపిస్తుండడంతో పలు హాలీవుడ్ మీడియాలో రామ్ చరణ్ తో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికన్ పాపులర్ టాక్ షోలు.. గుడ్ మార్నింగ్ అమెరికా, ఎంటర్‌టైన్‌మెంట్ టునైట్ వంటి షోలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నాడు చరణ్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన హాలీవుడ్ డెబ్యూట్ గురించి వెల్లడించాడు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, కొన్ని నెలలో నా హాలీవుడ్ డెబ్యూట్ గురించి వార్త వినబోతున్నారు అంటూ వెల్లడించాడు.
Ram Charan: త్వరలోనే ఆ వార్త వింటారంటోన్న చరణ్..!
అలాగే హాలీవుడ్ లో ఎవరితో కలిసి నటించాలని అనుకుంటున్నాడో అనేది కూడా తెలియజేశాడు. ప్రముఖ హాలీవుడ్ యాక్ట్రెస్ ‘జూలియా రోబర్ట్స్’తో యాక్ట్ చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆమె సినిమాలో ఒక చిన్న గెస్ట్ రోల్ చేసినా చాలు అంటూ తన మనసులోని కోరికను బయట పెట్టాడు. మరి తన కోరిక నెరవేరుతుందా లేదా చూడాలి. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ తెలుగులో పలు ప్రాజెక్ట్ లకు సైన్ చేశాడు. వాటిలో ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న మూవీ RC15.
Ram Charan – NTR : ఆ విషయంలో చరణ్, ఎన్టీఆర్‌ని ఫాలో అవుతున్నాడు అంటున్న నెటిజెన్లు..
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా వస్తుంది. ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజు ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి CEO (చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్), సేనాని, సైనికుడు అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. మరి వీటిలో ఏ టైటిల్ ని ఖరారు చేస్తారో చూడాలి. కాగా ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.