Ram Charan – NTR : ఆ విషయంలో చరణ్, ఎన్టీఆర్‌ని ఫాలో అవుతున్నాడు అంటున్న నెటిజెన్లు..

ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన భారీ మల్టీస్టార్రర్ చిత్రం 'RRR'. ఈ మూవీతో వీరిద్దరి మధ్య ఎంతటి స్నేహం ఉందో అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటే.. రామ్ చరణ్ ఒక విషయంలో తన ఫ్రెండ్ ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్నాడు అంటూ నెటిజెన్లు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

Ram Charan – NTR : ఆ విషయంలో చరణ్, ఎన్టీఆర్‌ని ఫాలో అవుతున్నాడు అంటున్న నెటిజెన్లు..

Ram Charan - NTR

Updated On : March 8, 2023 / 4:08 PM IST

Ram Charan – NTR : ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన భారీ మల్టీస్టార్రర్ చిత్రం ‘RRR’. ఈ మూవీతో వీరిద్దరి మధ్య ఎంతటి స్నేహం ఉందో అందరికి తెలిసిందే. ఇటీవల చరణ్ తండ్రి కాబోతున్న విషయాన్ని కూడా ఎన్టీఆర్‌కే మొదటి చెప్పాడు అంటే వారి మధ్య స్నేహం ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. ఇది ఇలా ఉంటే.. రామ్ చరణ్ ఒక విషయంలో తన ఫ్రెండ్ ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్నాడు అంటూ నెటిజెన్లు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు అమెరికా ఆస్కార్ ప్రమోషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Ram Charan : నేను ఆస్కార్ కోసం వెళ్లడం లేదు.. వాళ్ళ కోసమే వెళ్తున్నాను.. రామ్‌చరణ్!

అక్కడ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా ఉన్న సమయంలో కూడా రామ్ చరణ్, ఉపాసనకు టైం కేటాయించి.. ఆమెను బయటకి షికారుకు తిసువెళ్లి షాపింగ్ చేయించి ఆనందపరిచాడు. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో చరణ్ షాపింగ్ చేసిన బ్యాగ్స్ మోస్తూ వస్తుంటే, ఉపాసన మాత్రం జాలిగా వెళ్తూ కనిపిస్తుంది. ఆ సీన్ చూస్తుంటే ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలోని ఒక పాటలోని సన్నివేశంలా కనిపిస్తుంది.

ఆ సీన్ లో ఎన్టీఆర్ బ్యాగ్స్ మోస్తుంటే, ముందు హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తుంటుంది. దీంతో ఆ రెండు సన్నివేశాలను పక్కపక్కన పెట్టి ‘లైక్ భీమ్ లైక్ రామ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా మార్చి 12న ఆస్కార్ అవార్డుల పురస్కారం జరగనున్న సంగతి తెలిసిందే. ఇండియన్ టైం ప్రకారం మార్చి 13 ఉదయం గం.5:30 నిముషాలకు ఆస్కార్ వేడుక మొదలు కానుంది. ఈ కార్యక్రమాని ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by fasak.boss (@fasakboss)