Upasana Ready to Doing Service programs IN Pithapuram For Pawan Kalyan
Pawan Kalyan : ఏపీలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్న శాఖలలో పనులు పరుగులు పెట్టిస్తున్నారు. అభివృద్ధి పనులను చేయిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాలకు నీరు, రోడ్లు అందచేస్తూ కనీస అవసరాలను తీరుస్తున్నారు. ఇక తన సొంత నియోజకవర్గం పిఠాపురం అయితే అభివృద్ధిలో పరిగెడుతుంది. పిఠాపురంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యల పరిష్కారాలు చేస్తున్నారు పవన్. ఇప్పుడు పవన్ కి తోడుగా మెగా కోడలు ఉపాసన కూడా అభివృద్ధిలో భాగం కాబోతున్నారు.
Also See : Digangana Suryavanshi : మహా కుంభమేళాలో హీరోయిన్ దిగంగన సూర్యవంశీ.. ఫ్యామిలీతో వచ్చి..
మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన తమ అపోలో సంస్థల తరపున ఓ సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చారు. తాజాగా దానికి సంబంధించిన వివరాలు ప్రకటించారు. ఉపాసన తాతయ్య, అపోలో అధినేత డాక్టర్ ప్రతాపరెడ్డి బర్త్ డే సందర్భంగా మదర్ హుడ్ అనే ప్రోగ్రాంని మొదలుపెట్టబోతుంది ఉపాసన. అపోలో మెడికల్ కాలేజీ అపోలో ఫౌండేషన్ కలిసి పిఠాపురంలో మోడల్ అంగన్వాడీ సెంటర్ ని ప్రారంభిస్తున్నారు. తల్లులకు, కొత్తగా పుట్టిన పిల్లలకు మంచి ఆరోగ్యం, న్యూట్రీషియన్ ఫుడ్ అందించడమే ఈ కార్యక్రమం కర్తవ్యం. అలాగే అక్కడి మహిళలు ఆర్ధిక స్వాతంత్ర్యం కోసం నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. తల్లి సంరక్షణ, మహిళా సాధికారత మీద అక్కడి వారికి అవగాహన కలిపించనున్నారు. అలాగే పిఠాపురంలో మొదలుపెట్టి రాష్ట్రంలో 109 అంగన్‌వాడీ కేంద్రాలను పునరుద్దించనున్నారు అపోలో మేనేజ్మెంట్.
ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ తో పాటు పిఠాపురం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ఉపాసన కదిలి రావడం, తన అపోలో సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం అభినందననీయం అని అంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.
Also Read : NTR : నాటు నాటు స్టెప్పుతో ఫిఫా వరల్డ్ కప్ పోస్టర్.. ఎన్టీఆర్ పేరుతో.. అదిరింది బాసూ..
ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికే పిఠాపురాన్ని అభివృద్ధిలో పరిగెత్తిస్తున్నారు. ఇప్పటికే పిఠాపురంలో.. పశువుల సంత ఆధునీకరణకు నిధులు మంజూరు చేసారు. పిఠాపురం – సామర్ల కోట రోడ్డు వేశారు, లోకల్ లో ఉన్న పాడైన రోడ్లన్నీ కొత్తగా వేశారు. పిఠాపురానికి 100 పడకల ఆసుపత్రి మంజూరు చేసారు. రైల్వే మంత్రితో మాట్లాడి కొన్ని ట్రైన్స్ పిఠాపురంలో ఆగేలా చేశారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసారు. పిఠాపురంలో కాలువల మీద ఉన్న వంతెనలకు రక్షణ గోడలు కట్టించారు. ప్రభుత్వ పాఠశాలకు క్రీడా మైదానం కోసం ఎకరం స్థలం సొంత డబ్బుతో కొనిచ్చారు. గవర్నమెంట్ కాలేజీకి కంప్యూటర్లు, స్కూల్ కి స్పోర్ట్స్ కిట్స్ అందించారు. డంపింగ్ యార్డ్ సమస్య తీర్చారు… ఇలా రెగ్యులర్ గా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.