Ram Charan : బాలీవుడ్ ఖాతాలో రామ్ చరణ్‌కి ఇంటెర్నేషనల్ అవార్డు

రామ్ చరణ్‌ను అంతర్జాతీయ అవార్డు వరించింది. పాప్ గోల్డెన్ అవార్డ్స్‌లో రామ్ చరణ్‌ 'గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్' అవార్డు దక్కించుకోవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు చాలా సంతోషకరమైన వార్త. రామ్ చరణ్ మరో ఇంటర్నేషనల్ అవార్డుతో అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. పాప్ గోల్డెన్ అవార్డ్స్‌లో రామ్ చరణ్‌ను ‘గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్’ అవార్డు వరించింది.

Tarak Ponappa : దేవర సెట్లో ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ గురించి ఈ కన్నడ యాక్టర్ ఏమని చెప్పాడో చూడండి..

అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్‌లో రామ్ చరణ్‌కు ‘గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్’ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ అవార్డు కోసం రామ్ చరణ్‌తో పాటు అదా శర్మ, విశేష్ బన్సల్, అర్జున్ మాథుర్, షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, రిద్ధి డోగ్రా, రాశి ఖన్నా నామినేషన్స్‌లో ఉన్నారు. కాగా రామ్ చరణ్‌కి ఈ అవార్డు దక్కడం విశేషం.

Guntur Kaaram : గుంటూరు కారం అప్డేట్ వచ్చేసింది.. మహేష్ కి ముద్దు పెట్టిన శ్రీలీల..

ఇటీవలే రామ్ చరణ్ ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ (ఆస్కార్) వెల్లడించిన క్లాస్ ఆఫ్ యాక్టర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వెను వెంటనే పాప్ గోల్డెన్ అవార్డ్స్‌లో ‘గోల్డెన్ బాలీవుడ్ అవార్డు’ దక్కడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్ర ఖని, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2024 లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

ట్రెండింగ్ వార్తలు