Ram Charan : కొరియన్ ఎంబసీ నాటు నాటు సాంగ్ డ్యాన్స్‌ పై చరణ్ ట్వీట్..

ఈ నెలతో ఆల్మోస్ట్ RRR రిలీజ్ అయ్యి సంవత్సరం పూర్తి అవుతుంది. కానీ ఈ మూవీ క్రియేట్ చేసిన మానియా నుంచి సినీ ప్రియులు మాత్రం ఇంకా బయటకి రాలేకపోతున్నారు. తాజాగా ఈ మూవీ మానియా సౌత్ కొరియాకి కూడా చేరుకుంది. ఇటీవల..

Ram Charan's tweet on Korean Embassy Natu Natu song dance

Ram Charan : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ గురించి గత ఏడాది కాలంగా మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఈ నెలతో ఆల్మోస్ట్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి సంవత్సరం పూర్తి అవుతుంది. కానీ ఈ మూవీ క్రియేట్ చేసిన మానియా నుంచి సినీ ప్రియులు మాత్రం ఇంకా బయటకి రాలేకపోతున్నారు. అందుకనే ఈ చిత్రాన్ని ఈ మార్చి 3న అమెరికాలో మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక జపాన్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యి 100 రోజులు అవుతున్నా హౌస్ ఫుల్ షోలు పడుతున్నాయి. తాజాగా ఈ మూవీ మానియా సౌత్ కొరియాకి కూడా చేరుకుంది.

Naatu Naatu : ఆస్కార్ స్టేజి పై నాటు నాటు సాంగ్ పర్ఫామెన్స్..

ఇటీవల కొరియన్ ఎంబసీ అధికారులు అంతా కలిసి నాటు నాటు పాటకు కవర్ సాంగ్ చేశారు అంటే అర్ధం చేసుకోండి మన సౌత్ సాంగ్ ప్రపంచ దేశాలను ఎలా ఉర్రూతలుగిస్తుందో. కొరియన్ ఎంబసీ ఇండియా అధికార ప్రతినిధి అయిన చాంగ్ జె బాక్ మరియు ఎంబసీలో పనిచేసి కొరియన్, ఇండియన్ స్టాఫ్.. దాదాపు 50 మంది కలిసి నాటు నాటు సాంగ్ కి డ్యాన్స్ చేసి షేర్ చేశారు. ఇక ఈ వీడియో పై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. ‘చాలా కష్టపడి అద్భుతంగా చేశారు’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

తాజాగా దీని పై RRR హీరో రామ్ చరణ్ కూడా రియాక్ట్ అయ్యాడు. ‘కూలెస్ట్ డాన్స్ మూవ్స్ ఎవర్. నాటు నాటు సాంగ్ పై మీరు చూపిస్తున్న ప్రేమకు నా కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశాడు. ఇది ఇలా ఉంటే.. నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 12న ఈ ఫంక్షన్ జరగనుంది. కాగా నాటు నాటు సాంగ్ పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ.. ఆస్కార్ స్టేజి పై లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు అంటూ అకాడమీ తమ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.