Naatu Naatu : ఆస్కార్ స్టేజి పై నాటు నాటు సాంగ్ పర్ఫామెన్స్..

రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం ఇప్పుడు ఆకాశ అంచులను అందుకునే సమయానికి వచ్చింది. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్న ఈ పాట ఆస్కార్ బరిలో కూడా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ రోజు ఈ పాటని లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారట.

Naatu Naatu : ఆస్కార్ స్టేజి పై నాటు నాటు సాంగ్ పర్ఫామెన్స్..

Naatu Naatu

Naatu Naatu : రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం ఇప్పుడు ఆకాశ అంచులను అందుకునే సమయానికి వచ్చింది. బిఫోర్ ఇండిపెండెన్స్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో రామ్ చరణ్ – అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ – కొమరం భీమ్ గా నటించారు. సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది అవుతున్న ఈ మూవీ మానియా ఇంకా కొనసాగుతూనే ఉంది అంటే ఈ చిత్రం ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అర్ధమవుతుంది. వరల్డ్ వైడ్ గా ఎన్నో ఇంటర్నేషనల్ వేదికల్లో చోటు దక్కించుకోవడమే కాకుండా అవార్డులను కూడా సొంతం చేసుకుంటూ ఇండియన్ సినిమాను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తూ వెళుతుంది.

RRR at HCA : హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు.. ఏకంగా అయిదు అవార్డులు కొల్లగొట్టిన RRR

ఈ సినిమాకి ఇతర దేశాల్లో కూడా భారీ ప్రజాభిమానం పొందడానికి ముఖ్య కారణం ‘నాటు నాటు’ సాంగ్. ఒక సౌత్ ఇండియన్ మాస్ సాంగ్ ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలుగిస్తుంది అని కలలో కూడా ఎవరు అనుకోని ఉండరు. ఈ పాటకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాట పాడారు. ఇక ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్న ఈ పాట ఆస్కార్ బరిలో కూడా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ రోజు ఈ పాటని లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారట.

మర్చి 12న జరిగే 95వ అకాడమీ అవార్డ్స్ లో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు అంటూ అకాడమీ తమ సోషల్ ప్లాట్‌ఫార్మ్ హ్యాండిల్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. దీంతో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవకి అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా నేడు (మర్చి 1) లాస్ ఏంజెల్స్ లో 1647 లార్జెస్ట్ సీటింగ్ ఉన్న ఏస్ హోటల్ థియేటర్ లో RRR స్క్రీనింగ్ జరగనుంది. ఈ స్క్రీనింగ్ కి రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్ హాజరవ్వనున్నారు. స్క్రీనింగ్ అనంతరం ఆడియన్స్ తో చిట్ చాట్ నిర్వహించనున్నారు.