RGV : నెపోటిజం చంపేద్దాం.. అవార్డ్స్ అన్ని ఫేక్.. ‘యువర్ ఫిల్మ్’ అంటూ ఆర్జీవీ కొత్త కాన్సెప్ట్..

ఎప్పుడూ సంచలన నిర్ణయాలతో ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచే రామ్ గోపాల్ వర్మ.. నెపోటిజం చంపేద్దాం, అవార్డ్స్ అన్ని ఫేక్ అంటున్నారు.

Ram Gopal Varma about nepotism awards and film making

RGV : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సంచలన నిర్ణయాలతో ఎప్పుడూ ఆడియన్స్ ని ఆశ్చర్యపరుస్తూ వస్తుంటారు. తాజాగా ఈ సంచలనాల దర్శకుడు నెపోటిజం గురించి, అవార్డుల గురించి ‘యువర్ ఫిలిం’ అంటూ ఆసక్తికర పోస్టులు వేశారు. ఒక సినిమాని హిట్ చేయాలన్నా, ప్లాప్ చేయాలన్నా.. ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. అలాంటిది ఆ ప్రేక్షకులు ఒక సినిమా చేయలేరా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఒకవేళ అలా సినిమా తీసే టాలెంట్ ఉన్న ఆడియన్స్ ఉంటే.. వారికీ సపోర్ట్ చేయడానికి తాను సిద్ధం అంటున్నారు. అలాగే ఫేక్ అవార్డులను, ఇండస్ట్రీలో కనిపించే నెపోటిజంని కూడా చంపేద్దాం అంటూ పిలుపునిస్తున్నారు. స్టార్స్ వారసులు కాకుండా ఒక సాధారణ వ్యక్తి స్టార్ అయ్యేలా చేద్దాం అంటున్నారు. సినిమా గురించి నేర్చుకోవడం కోసం ఫిలిం ఇన్‌స్టిట్యూషన్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. అవి మీ టైం అండ్ మనీని వేస్ట్ చేస్తాయి. అందుకనే వాటిని కూడా నిర్ములిద్దాం అని చెబుతున్నారు.

Also read : Urfi Javed : ఉర్ఫీ జావేద్ సమ్మర్ స్పెషల్ అవుట్ ఫిట్ చూశారా.. ఫ్యాన్స్ ఎక్కడ పెట్టిందో చూశారా..!

అసలైన సినిమా మేకింగ్ అంటే ఏంటో పని చేస్తూ నేర్చుకుందాం అని ఆర్జీవీ డెన్ కి ఆహ్వానిస్తున్నారు. మరి మిలో టాలెంట్ ఉండి, ఇంటరెస్ట్ ఉంటే.. Rgvden.com కి వెళ్లి అక్కడ మీకు కావాల్సిన డీటెయిల్స్ ని తెలుసుకోండి.