Urfi Javed : ఉర్ఫీ జావేద్ సమ్మర్ స్పెషల్ అవుట్ ఫిట్ చూశారా.. ఫ్యాన్స్ ఎక్కడ పెట్టిందో చూశారా..!
డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ తో నెట్టింట నిత్యం వైరల్ అయ్యే ఉర్ఫీ జావేద్.. తాజాగా స్పెషల్ సమ్మర్ అవుట్ ఫిట్ తో నెటిజెన్స్ ముందుకు వచ్చింది.

Bollywood Actress Urfi Javed new summer special dress gone viral
Urfi Javed : బాలీవుడ్ బిగ్‌బాస్ బ్యూటీ ‘ఉర్ఫీ జావేద్’ తన డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ తో నెట్టింట నిత్యం వైరల్ అవుతుంది. ఈ అమ్మడు డిజైన్ చేయించుకొనే డ్రెస్సులు చూస్తే.. అసలు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయిరా బాబు అనిపిస్తుంది. ఇటీవల సూర్యుడు చుట్టూ తిరిగి తొమ్మిది గ్రహాలతో కలిపి మొత్తం విశ్వాన్ని తన డ్రెస్సులో పెట్టేసి డిజైన్ చేయించుకొంది. ఆ డ్రెస్సుతో ముంబై వీధుల్లో తిరుగుతూ సందడి చేసింది.
ఇక తాజాగా సమ్మర్ స్పెషల్ అవుట్ ఫిట్ తో నెటిజెన్స్ ముందుకు వచ్చి క్రేజీ ఫీలింగ్ కి గురి చేస్తుంది. షార్ట్ డ్రెస్సుల్లో నడుము అందాలు చూపిస్తూ.. ఎదపై ఫ్యాన్స్ పెట్టుకొని, వాటికీ బ్యాటరీ కనెక్షన్ కూడా ఇచ్చి గిర్రుమని తిప్పుతూ క్రేజీగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అవుట్ ఫిట్ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియోలు చూసిన నెటిజెన్స్.. సరదా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
Also read : Pushpa 2 : పుష్ప అంటే ఆ మాత్రం క్రేజ్ సాధారణమే.. సురేష్ రైనా ఇన్‌స్టా పోస్ట్ వైరల్..
కాగా ఉర్ఫీ హిందీ టీవీ సీరియల్స్ లో నటించి ఇండస్ట్రీలో ఒక గుర్తింపుని సంపాదించుకుంది. ఆ తరువాత హిందీ బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లో ఉన్నదీ కొన్ని రోజులే అయినా మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ఇక ఫేమ్ తో బయటకి వచ్చిన ఉర్ఫీ.. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తూ వస్తుంది.
View this post on Instagram
View this post on Instagram