Ram Gopal Varma as Jesus
Ram Gopal Varma : సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏమి చేసిన అది కచ్చితంగా వివాదం కావాల్సిందే. రాజకీయం నుంచి సినిమాల వరకు నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో, చర్యలతో హాట్ టాపిక్ మారే వర్మ, మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా అందరూ క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్న సమయంలో.. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ అందర్నీ ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది.
RGV: అవతార్-2 డైరెక్టర్‌పై వర్మ కామెంట్స్.. దేవుడితో సమానమట!
అయితే ఇదేదో వర్మ చేస్తున్న సినిమా కాదండి. దేవుడిని నమ్మని వాళ్ల అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ.. లార్డ్ జీసస్ ఫొటోలో తన ముఖాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేశాడు. వర్మ చేసిన ఈ పనిని నెటిజెన్లు తీవ్రంగా కండిస్తూ, ఆ ఫోటోని డిలీట్ చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
కాగా ఇటీవలే ఈ దర్శకుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి సంబంధించి ఒక సినిమాని ప్రకటించి సంచలనం సృష్టించాడు. ‘వ్యూహం’, ‘శపథం’ అంటూ టైటిల్స్ ని ఖరారు చేసిన వర్మ.. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. వచ్చే శాసనసభ ఎన్నికల టార్గెట్ గానే ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఆంధ్రప్రదేశ్ లోని పలు రాజకీయ పార్టీ నాయకులను విమర్శ చేసేలా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
MERRY CHRISTMAS to all NON BELIEVERS ??? pic.twitter.com/oOR4FV5sTe
— Ram Gopal Varma (@RGVzoomin) December 25, 2022