RGV: అవతార్-2 డైరెక్టర్‌పై వర్మ కామెంట్స్.. దేవుడితో సమానమట!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా నెట్టింట సెన్సేషన్‌గా మారుతుండటం సహజం. అయితే ఇటీవల ఆయన తనకు నచ్చిన సినిమాలకు సంబంధించి తనదైన రివ్యూలు, కామెంట్లు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఇక తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయిన హాలీవుడ్ విజువల్ వండర్ ‘అవతార్-2’ సినిమాపై వర్మ కామెంట్ చేశారు.

RGV: అవతార్-2 డైరెక్టర్‌పై వర్మ కామెంట్స్.. దేవుడితో సమానమట!

RGV Latest Comments On Avatar 2 Director James Cameron

Updated On : December 18, 2022 / 8:09 PM IST

RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా నెట్టింట సెన్సేషన్‌గా మారుతుండటం సహజం. అయితే ఇటీవల ఆయన తనకు నచ్చిన సినిమాలకు సంబంధించి తనదైన రివ్యూలు, కామెంట్లు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఇక తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయిన హాలీవుడ్ విజువల్ వండర్ ‘అవతార్-2’ సినిమాపై వర్మ కామెంట్ చేశారు.

Avatar 2: అవతార్-2 సినిమా కాదంటోన్న వర్మ.. అది నేరమట!

ఈ సినిమా ఓ అద్భుతమని ఆయన ‘అవతార్-2’పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్ పై వర్మ మరోసారి తాజాగా కామెంట్స్ చేశాడు. ‘‘ఆ భగవంతుడు భూమిని సృష్టిస్తే.. జేమ్స్ కామెరూన్ పాండోరాను సృష్టించాడు’’ అంటూ వర్మ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఇలాంటి విజువల్ వండర్ చిత్రాలు చాలా అరుదుగా వస్తాయని, ఇంతటి పర్ఫెక్షన్‌తో వాటిని తీర్చిదిద్దడం మామూలు విషయం కాదని వర్మ తెలిపారు.

Avatar 2: ‘అవతార్-2’పై టాలీవుడ్ ప్రొడ్యూసర్ కామెంట్స్.. డాక్యుమెంటరీ అదిరిందట!

ఇక ఈ సినిమాలోని గ్రాండ్ విజువల్స్ తనను మంత్రముగ్ధుడిని చేశాయని వర్మ తెలిపాడు. కాగా, అవతార్-2 మూవీ తొలిరెండు రోజుల్లోనే ఇండియావైడ్‌గా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడంతో ఈ సినిమా మున్ముందు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.