MAA Elections: లోకల్.. నాన్ లోకల్.. రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లోకలా?

ఎక్కడ కాంట్రవర్శీకి అవకాశం ఉంటే అక్కడ వాలిపోతాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం "మా" ఎన్నికలవేళ లోకల్.. నాన్ లోకల్ అనే పదాల వాడకం ఎక్కువ అవగా.. ఇదే అంశంపై ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్‌గా ట్వీట్లు సంధించాడు రామ్ గోపాల్ వర్మ.

Ram Gopal Varma Comments Ntr Anr In Support Of Prakash Raj In Maa Elections

Ram Gopal Varma Comments on NTR, ANR: ఎక్కడ కాంట్రవర్శీకి అవకాశం ఉంటే అక్కడ వాలిపోతాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం “మా” ఎన్నికలవేళ లోకల్.. నాన్ లోకల్ అనే పదాల వాడకం ఎక్కువ అవగా.. ఇదే అంశంపై ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్‌గా ట్వీట్లు సంధించాడు రామ్ గోపాల్ వర్మ.

ఈ సంధర్భంగా కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే, గుడివాడ నుంచి చెన్నైకి వెళ్లిన రామారావుగారు, నాగేశ్వరరావుగారు.. బుర్రిపాలెం నుంచి మద్రాస్ వెళ్లిన కృష్ణ గారు, తిరుపతి నించి మద్రాస్ బయల్దేరిన మోహనబాబు గారు లోకలా? ఎలా ఎలా ఎలా? అంటూ ఒక ట్వీట్ వేశారు. అందుకు కొనసాగింపుగా వరుస ట్వీట్లలో ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్ చేశారు.

కర్ణాటక నుంచి ఏపీకి వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే, మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్ళిన రజనీకాంత్ గారు, ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి వెళ్ళిపోయిన అమితాబ్ బచ్చన్ గారు లోకలా?” ముప్పై ఏళ్లుగా ప్రకాష్ రాజ్.. ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని, చలం పుస్తకాలని మళ్ళీ తనే స్వయంగా ముద్రించి , పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ.. తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని, అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పించాడు.. ప్రకాష్ రాజ్ నాన్ లోకలా..???

ప్రకాష్ రాజ్ నటన చూసి, నాలుగు సార్లు ఈ దేశం శాలువా కప్పి నేషనల్ అవార్డుతో సత్కరిస్తే, అతను నాన్ లోకలా? ఈ కామెంట్ దేశానికే వ్యతిరేకం కాదా? మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ అందరూ నాన్ లోకలే.. మైఖేల్ జాక్సన్ నాన్ లోకల్.. బ్రూస్‌లీ నాన్ లోకల్.. రాముడు సీత కూడా నాన్ లోకలే.. ప్రకాష్ రాజ్ కూడా నాన్ లోకలే కదా?