పవన్ కళ్యాణ్‌ని దెయ్యమై పట్టుకుంటా: రామ్ గోపాల్ వర్మ

  • Publish Date - December 14, 2019 / 07:41 AM IST

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ రామ్ గోపాల్ వర్మ.. కంటెంట్ మాట పక్కనపెట్టేసి వివాదాలే కథాంశంగా  తీసుకుని సినిమా తీశాడు. ప్రమోట్ చేసుకోవడంలో సిద్ధహస్తుడైన వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే వివాదాస్పద టైటిల్‌తో వచ్చి సెన్సార్ ఒప్పుకోకపోవడంతో.. చివరకు అమ్మరాజ్యంలో కడప బిడ్డలు పేరుతో సినిమాను విడుదల చేశాడు. 

అయితే సినిమాలో నిజజీవితంలోని ఎంతోమంది రాజకీయ నాయకులను పాత్రలను పోలినట్లుగా క్యారెక్టర్లు క్రియేట్ చేసి రాద్ధాంతం చేశాడు. సినిమాలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ వంటి నేతలను కించపరిచినట్లుగా పాత్రలు ఉండడంతో ఆయా పార్టీల నేతలు వర్మపై ఫైన్ అవుతున్నారు.

ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా కోడూరుపాడు జనసేన యూత్ పేరుతో ఓ ఫ్లెక్సీ కట్టారు కొందరు జనసేన యూత్.. అందులో రామ్ గోపాల్ వర్మకు శ్రద్ధాంజలి ఘటించారు జనసేన యూత్. జోహార్ ది బాస్టర్డ్.. నీ ఆకస్మిక మరణం మాకు తీరని లోటు కాలిగించాలని, నీ ఆత్మకు ఎట్టి పరిస్థితులలో శాంతి చేకూరకూడదని భగవంతుని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులు, జనసేన కార్యకర్తలు అంటూ అందులో రాసుకొచ్చారు. మరణించిన తేదీలు కూడా అందులో వేశారు.

ఈ పోస్టర్‌ని స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ… మీ లీడర్ పవన్ కళ్యాణ్‌ని దెయ్యమై పట్టుకోవడానికి అతి త్వరలో వస్తున్నా అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు.. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఫన్ కోసమే తీశానని, రియల్‌గా నేను పవన్ కళ్యాణ్‌ని ప్రేమిస్తానని, దేవుడి మీద ఒట్టు ఇది నిజం అని అన్నారు.