Showman: హీరోగా రామ్ గోపాల్ వర్మ.. “షో మ్యాన్” మూవీ ఫస్ట్ లుక్ విడుదల..
రియల్ లైఫ్ లో షో మ్యాన్ అయిన ఆర్జీవీ "షో మ్యాన్(Showman)" అనే సినిమా చేస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే, దర్శకుడిగా కాదు హీరోగా.
Ram Gopal Varma first look released from from the Showman movie
Showman: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎం చేసిన సంచలనమే. ఇప్పుడు ఈయన మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. అదేంటంటే, రియల్ లైఫ్ లో షో మ్యాన్ అయిన ఆర్జీవీ “షో మ్యాన్(Showman)” అనే సినిమా చేస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే, దర్శకుడిగా కాదు హీరోగా. అవును రామ్ గోపాల్ వర్మ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా “షో మ్యాన్”. “మ్యాడ్ మాన్ స్టర్” అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాతో నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గతంలో రామ్ గోపాల్ వర్మతో ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ 2 సినిమాలు చేసిన తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Suresh Babu: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే అఖండ 2 విడుదల.. స్పందించిన సురేష్ బాబు
టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన సుమన్ ఇప్పుడు మరోసారి రామ్ గోపాల్ వర్మ సినిమాలో తన విలనిజాన్ని చూపించనున్నాడు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తికానుంది. 2026 సంక్రాంతికి ట్రైలర్ విడుదల చేసి, అప్పుడే విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని నిర్మాత రామసత్యనారాయణ తెలిపారు. మరి ఇంతకాలం దర్శకుడిగా చేసిన రామ్ గోపాల్ వర్మ హీరోగా ఏమేరకు ఆకట్టుకుంటాడు అనేది చూడాలి.

Ram Gopal Varma first look released from from the Showman movie
