Ram Gopal Varma INDIA MOTOR SPORTS driven ACTION film with Gaurav Gill
Ram Gopal Varma : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమా అనౌన్స్‌మెంట్స్ తోనే సంచలనాలు సృష్టిస్తుంటాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై వ్యూహం, శపథం అనే సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ జీవితంలో జరిగిన సంఘటనలు తీసుకోని వర్మ ఈ సినిమాలను చిత్రీకరిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే, ఆర్జీవీ తాజాగా తన నెక్స్ట్ సినిమా గురించి హింట్ ఇచ్చాడు. ఇండియన్ ఫస్ట్ మోటార్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ని తెరకెక్కించేందుకు వర్మ సిద్దమవుతున్నాడట.
ప్రముఖ కారు రేసర్ గౌరవ్ గిల్ తాజాగా వర్మ ఆర్జీవీ డెన్ కి వచ్చాడు. ఆ ఫోటోని వర్మ షేర్ చేస్తూ.. ‘త్వరలో ఇండియన్ ఫస్ట్ మోటార్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కబోతుంది’ అంటూ తెలియజేశాడు. ఈ సినిమాకి సంబంధించిన కథ చర్చలు కోసమే గౌరవ్ గిల్.. ఆర్జీవీ డెన్ కి వచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఇటీవల వర్మ తన ఫార్మ్ హౌస్ లో కారు రేసింగ్ చేస్తూ ఒక వీడియోని షేర్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ మూవీ ఎప్పుడు పట్టాలు ఎక్కబోతుందో చూడాలి.
Also read : Amala Paul : రెండో పెళ్ళికి అమలాపాల్ రెడీ.. బర్త్‌డే రోజు ప్రపోజ్ చేసిన బాయ్‌ఫ్రెండ్
ఇక వ్యూహం, శపథం సినిమాలు విషయానికి వస్తే.. రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్ పై జరిగిన కుట్రలు, జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఆ తర్వాత జగన్ సీఎం ఎలా అయ్యారు? సీఎం అయ్యాక ఏం చేశారు అనే అంశాలతో ఈ రెండు సినిమాలు ఉండనున్నాయి. వ్యూహం సినిమాని 2023 నవంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు, శపథం సినిమాని 2024 జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ఆర్జీవీ ఆల్రెడీ ప్రకటించాడు.