Ram Gopal Varma: నేనేమీ డిమాండ్లు చేయలేదు.. సమస్యల పరిష్కారానికి అభిప్రాయాలే చెప్పా..!

ఏపీ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ ముగిసింది. పరిశ్రమలో నెలకొన్న తాజా సమస్యలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు రామ్ గోపాల్ వర్మ చెప్పారు.

Ram Gopal Varma: నేనేమీ డిమాండ్లు చేయలేదు.. సమస్యల పరిష్కారానికి అభిప్రాయాలే చెప్పా..!

Varma

Updated On : January 10, 2022 / 4:03 PM IST

Ram Gopal Varma: ఏపీ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ ముగిసింది. పరిశ్రమలో నెలకొన్న తాజా సమస్యలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. అయితే.. తాను ఏమీ డిమాండ్లు చేయలేదని.. పరిశ్రమలో ఉన్న ప్రస్తుత సమస్యలపై అభిప్రాయాలు మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు. తాను డిస్ట్రిబ్యూటర్ల తరఫునో.. నిర్మాతల తరఫునో మంత్రిని కలవలేదని తేల్చి చెప్పారు.

“టికెట్ రేట్ల పెంపుతో పాటు.. సినిమా పరిశ్రమలోని మరికొన్ని సమస్యలపై మంత్రి పేర్ని నానితో మాట్లాడాను. నేనేమీ డిమాండ్లు చేయలేదు. కానీ.. సమస్యల పరిష్కారంపై నా అభిప్రాయాలు చెప్పాను. ఆ దిశగా తర్వాత చర్యలు జరగాల్సి ఉంది. నా సూచనలను మంత్రి విన్నారు. ఈ సమావేశంపై నేను సాటిస్ఫై అయ్యాను” అని రామ్ గోపాల్ వర్మ చెప్పారు.

ప్రభుత్వం తన అభిప్రాయాలు తీసుకుంటుందని చెప్పిన వర్మ.. సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తప్పక చేపడుతుందన్నారు. పరిశ్రమలో పవన్ కల్యాణ్ నో, బాలకృష్ణనో టార్గెట్ గా చేసుకుని.. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని తాను భావించడం లేదని వర్మ చెప్పారు. అందరి సంక్షేమం దిశగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

ఒక్క సమావేశంతోనే అంతా అయిపోదని.. ప్రతి సమస్యకు పరిష్కారం రాదని వర్మ అన్నారు. ఇది సిరీస్ ఆఫ్ డిస్కషన్ గా చెప్పారు. మరోసారి మంత్రి నానితో తన సమావేశం ఉంటుందనే అభిప్రాయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పారు.

Read More:

RGV & Perni Nani: సినిమాల్లేక టైంపాస్ కోసం వెళ్లాడు.. ఇదంతా ఐదుగురి గేమ్

RGV : ఫిల్మ్ మేకర్ గానే కలవడానికి వచ్చాను.. పరిశ్రమ తరపున రాలేదు

RGV-Nani Meet: నేడే వర్మ-నాని మీటింగ్.. రాజకీయాల్లో హాట్ టాపిక్..

RGV NANI MEET: టికెట్‌పై ఫేస్ టు ఫేస్.. నానితో వర్మ మీటింగ్‌.. క్లారిటీ వస్తుందా?