Ram Gopal Varma Prasanth Varma Suparn Varma Enjoying Photos Videos goes Viral
RGV – Prasanth Varma – Suparn Varma : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఏం పోస్ట్ చేసినా వైరల్ అవ్వాల్సిందే. తాజాగా ఆర్జీవీ ఓ సరదా వీడియోని పోస్ట్ చేసారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్టర్ సుపర్న్ వర్మ తో కలిసి రామ్ గోపాల్ వర్మ ఎంజాయ్ చేస్తున్న వీడియోని తన ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. ఈ వీడియోలో ప్రశాంత్ వర్మ సుశి అనే ఫుడ్ ని ఆర్జీవీకి తినిపిస్తున్నాడు.
Also Read : Pranav Mohanlal : తండ్రి స్టార్ హీరో.. కొడుకు మాత్రం స్పెయిన్ లో కూలి పని.. ఎవరంటే..
ఈ వీడియో షేర్ చేసి ఆర్జీవీ.. ఫ్యామిలీ మ్యాన్, హనుమాన్ కలిసి నాకు మొదటిసారి సుశి తినిపించారు అంటూ పోస్ట్ చేసాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా వీళ్ళు ముగ్గురు కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి. కర్త – వర్మ – క్రియ అని సరదాగా రాసుకొచ్చాడు. ప్రశాంత్ వర్మ, రామ్ గోపాల్ వర్మ, సుపర్న్ వర్మ.. ఇలా ముగ్గురు వర్మలు ఒకే చోట ఉన్నారు అంటూ ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
. @Suparn the FAMILY MAN and @prasanthvarma the HANU – MAN made me the non eating MAN eat SUSHI 😡😳 pic.twitter.com/Yduir4U21A
— Ram Gopal Varma (@RGVzoomin) November 11, 2024
ఆర్జీవీ ఇటీవల కల్కి సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కూడా ఏదో ఒక రోల్ ఇస్తే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ గురించి ఆర్జీవితో ముచ్చటించాడో లేదో..