Ram Gopal Varma
Ram Gopal Varma : ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా సినిమాలు చేసి తెలుగు, హిందీ ప్రేక్షకులను మెప్పించిన ఆర్జీవీ ఇప్పుడు తన ఇష్టం అంటూ తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటున్నాడు. ఆర్జీవీ నాగార్జున శివ సినిమాతో దర్శకుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. శివ సినిమా భారీ విజయం సాధించి ఫిలిం మేకింగ్ లో సరికొత్త ప్రయోగాలను తెరపైకి తీసుకొచ్చింది.
శివ సినిమాని 4K చేసి నవంబర్ 14న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈక్రమంలో అప్పుడు శివ సినిమాకు పనిచేసినవాళ్లు, శివ సినిమాని చూసిన సెలబ్రిటీలతో ఆ సినిమా గురించి మాట్లాడిస్తున్నారు. తాజాగా శివ సినిమా నిర్మాత, నాగార్జున అన్నయ్య అక్కినేని వెంకట్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలిపారు.
Also Read : Sudheer Babu : పర్ఫెక్ట్ బాడీతో మహేష్ బాబు బావ.. సుధీర్ బాబు డైట్ ప్లాన్ ఇదే.. ఫిట్నెస్ బిజినెస్ కూడా..
అక్కినేని వెంకట్ మాట్లాడుతూ.. శివ సినిమా స్క్రిప్ట్ చర్చల్లో నేను కూడా పాల్గొన్నాను. నేను కొన్ని ఇన్ పుట్స్ ఇచ్చినా ఆర్జీవీ తిరస్కరించాడు. ఒక పాత్ర కోసం మోహన్ బాబుని తీసుకోవాలని అనుకున్నాను. సినిమాలో విలన్ భవాని పాత్ర పక్కన ఉండే గణేష్ పాత్రకి మోహన్ బాబుని తీసుకుందాం అనుకున్నా. ఆర్జీవీకి మోహన్ బాబుని ఆ పాత్ర కోసం తీసుకొమ్మని చెప్పాను. మోహన్ బాబు చేస్తే కాస్టింగ్ పరంగా, బిజినెస్ పరంగా కూడా బెనిఫిట్ అవుతుంది భావించాను. కానీ వర్మ మాత్రం ఆ పాత్రకు మోహన్ బాబు అస్సలు వద్దు అన్నాడు. కొత్తవాళ్లు అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు అని చెప్పాడు. వర్మ అనుకున్నట్టే గణేష్ పాత్రకు కొత్త నటుడ్ని తీసుకొచ్చాడు. సినిమాలో ఆ నటుడు బాగానే సెట్ అయ్యాడు అని తెలిపారు.
శివ సినిమాలో విలన్ భవాని పక్కన ఉండే పాత్రల్లో గణేష్ ఒకటి. సినిమా అంతా ఈ పాత్ర ఉంటుంది. భవానికి, శివ కి మధ్యలో ఈ పాత్ర తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి పాత్రలో విశ్వనాధ్ అనే కొత్త నటుడు చేసాడు. అప్పటికే మోహన్ బాబు విలన్ పాత్రలు వేస్తూ బిజీగా ఉన్నారు. శివ వచ్చిన 25 ఏళ్ళ తర్వాత ఆర్జీవీ దర్శకత్వంలో రౌడీ అనే ఓ సినిమాలో మోహన్ బాబు నటించారు.
గణేష్ పాత్రలో మోహన్ బాబు బదులు నటించిన నటుడు విశ్వనాధ్ ఇతనే..