‘శివ’ సినిమాలో పూరిని చూశారా..

‘శివ’ సినిమాలో దర్శకుడు పూరి జగన్నాధ్ నటించిన విషయం వెల్లడించిన వర్మ..

  • Published By: sekhar ,Published On : March 15, 2020 / 11:10 AM IST
‘శివ’ సినిమాలో పూరిని చూశారా..

Updated On : March 15, 2020 / 11:10 AM IST

‘శివ’ సినిమాలో దర్శకుడు పూరి జగన్నాధ్ నటించిన విషయం వెల్లడించిన వర్మ..

కింగ్ నాగార్జున కెరీర్ ను కీలక మలుపుతిప్పిన ‘శివ’ సినిమాలో దర్శకుడు పూరి జగన్నాధ్ నటించాడనే సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘శివ’ తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా.. రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులతో పాటు సినీ ఇండస్ట్రీకి కూడా భారీ షాక్ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా వల్లే గత 30 ఏళ్లుగా దర్శకుడిగా చెలామణీ అవుతున్నాడు వర్మ.

 

అయితే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ‘శివ’ సినిమాలో కనిపించినట్టు చాలామందికి తెలియకపోవచ్చు. కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ తాజాగా ఈ సినిమాలోని ఓ స్టిల్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. కాలేజీలో నాగార్జున వెనుక పూరి ఉన్న ఫోటోకు ‘శివ షూటింగులో నాగార్జున, ఇస్మార్ట్ పూరి’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు వర్మ..