ట్రంప్ పక్కన రజనీకాంత్, సన్నీలియోన్‌…. కోటిమంది స్వాగతం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కోటిమందితో స్వాగతం - డైరెక్టర్ ఆర్జీవీ సెటైర్..

  • Publish Date - February 22, 2020 / 07:04 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కోటిమందితో స్వాగతం – డైరెక్టర్ ఆర్జీవీ సెటైర్..

అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌కి స్వాగతం పలకబోతున్న సౌత్ ఇండియన్ స్టార్స్.. నిజమనుకునేరు.. ఇదంతా కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ క్రియేటివిటీ. వివాదాలతో సావాసం చేసే వర్మ శనివారం సరికొత్త ట్వీట్ చేసాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24న భారత్ పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే.

అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీ ప్రాంతాలను పర్యటించనున్న ట్రంప్.. పూర్తి షెడ్యూల్ కొన్ని వారాల క్రితమే ఫిక్స్ అయింది. ట్రంప్ పర్యటనకోసం కేంద్రం భారీగా ఖర్చు పెడుతోంది. ఆయనకు అక్షరాలా కోటిమందితో స్వాగతం పలకాలని ప్లాన్ చేస్తున్నారు ప్రధాని మోడీ. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన స్టైల్‌లో ట్వీట్ చేసాడు.

ట్రంప్‌కు స్వాగతం పలకడానికి కోటిమంది రావాలంటే.. ఆయనతో పాటు స్టేజీమీద అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, రజనీకాంత్, కత్రినా కైఫ్, దీపికా పదుకొణె, సన్నీ లియోన్‌లను వరసగా నిలబెడితే.. వాళ్లని చూడడానికి పెద్ద సంఖ్యలో జనాలు వస్తారు. అప్పుడు మీరనుకుంటున్నట్టు కోటిమంది అవుతారు.. అంటూ వ్యంగ్యంగా ట్వీటాడు. ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Read More>>గోల్డ్ రష్ : వామ్మో బంగారం ధరలు