వర్మ ట్వీట్ : చిదంబరం అరెస్టు..ప్రజాస్వామ్యానికి నిజమైన నిదర్శనం

  • Publish Date - August 23, 2019 / 02:12 AM IST

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అరెస్టుపై పలువురు స్పందిస్తున్నారు. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఆయన అరెస్టులో ఓ ప్రత్యేకత ఉందని అభివర్ణించారు. ప్రజాస్వామ్యానికి నిజమైన నిదర్శనమన్నారు. గతంలో కేంద్ర హోం మంత్రి హోదాలో సీబీఐ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన..ఇప్పడు అదే ఆఫీసులో విచారణ ఎదుర్కొంటున్నారని ట్వీట్ చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని..మోడీ ప్రభుత్వం మళ్లీ నిరూపిస్తోందని మెచ్చుకున్నారు. 

Read More : ఎమోషనల్ అయిన అమితాబ్: 25 శాతం లివర్‌తో బతుకుతున్నా
ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో చిదంబరంను సీబీఐ ఆఫీసర్స్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ నూతన కార్యాలయంలో ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు. ఈనెల 26వ తేదీ వరకు సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. ఐదు రోజుల పాటు కస్టడీలోకి ఇవ్వాలంటూ సీబీఐ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. 2007-08, 2008-09 మధ్య చిదంబరానికి చెల్లింపులు చేశారన్న ఆరోపణలు ఆధారాలున్నాయని కోర్టు పేర్కొంది. చిదంబరం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తున్నారు. అరెస్టు అప్రజాస్వామికంటూ విపక్షాలు మండిపడ్డాయి.