Ram Pothineni Andhra King taluka movie release on Netflix.
Andhra King Taluka OTT: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా(Andhra King Taluka OTT)’.ఆ బయోపిక్ అఫ్ ఆ ఫ్యాన్ అంటూ వచ్చిన ఈ సినిమాను మహేష్ బాబు తెరకెక్కించాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమాకు పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ, ఎందుకో కలక్షన్స్ మాత్రం అంతగా రాబట్టలేకపోయింది ఈ సినిమా. నిజానికి, హీరో రామ్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు.
తన స్టార్డంని సైతం పక్కన పెట్టి ఒక అభిమానిగా చాలా బాగా నటించాడు. కానీ, బ్యాడ్ లక్ ఈ సినిమా కూడా రామ్ కి పరాజయాన్నే అందించింది అని చెప్పాలి. ఇక థియేట్రికల్ రన్ ముగించుకున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు డిసెంబర్ 25న ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుందట. త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రానుంది.
అయితే, రామ్ ఫ్యాన్స్ మాత్రం ఆంధ్ర కింగ్ తాలూకా ఓటీటీ రిలీజ్ పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఈ సినిమా బాగున్నప్పటికీ ఎక్కువ మంది థియేటర్స్ కి వెళ్లి సినిమాను చూడలేదు. కానీ, ఓటీటీలో అంటే అందరు తప్పకుండ చూస్తారు. కాబట్టి, ఓటీటీ విడుదల తరువాత ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చే అవకాశం ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.