Rakul Preeth Singh: ప్లాస్టిక్ సర్జరీల ఎఫెక్ట్.. రకుల్ పై నెటిజన్ షాకింగ్ పోస్ట్.. సీరియస్ అయిన బ్యూటీ
నార్త్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది ఈ బ్యూటీ. కానీ, ఒక్కసారిగా ఆమె కెరీర్ డౌన్ అయిపొయింది.
Rakul Preet Singh got serious with a netizen.
Rakul Preeth Singh: నార్త్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది ఈ బ్యూటీ. కానీ, ఒక్కసారిగా ఆమె కెరీర్ డౌన్ అయిపొయింది. తెలుగులో ఆమె చేసిన చివరి సినిమా నాగార్జునతో మన్మధుడు 2. అంతమందు ముందు కాస్త బొద్దుగా, క్యూట్ గా కనిపించిన రకుల్ మన్మధుడు సినిమా కోసం చాలా సన్నబడింది. కానీ, ఆ లుక్ ఆమెకు అంతగా సెట్ కాలేదు. నిజానికి ఆమెను అలా చూసి చాలా మంది షాక్ అయ్యారు. అసలు రకుల్(Rakul Preeth Singh) కు ఏమయ్యింది? ఎందుకు అలా సన్నబడింది అంటూ చాలా ట్రోలింగ్స్ నడిచాయి.
Yukti Thareja: స్పోర్ట్స్ డ్రెస్ లో గ్లామర్ పీక్స్.. కె ర్యాంప్ బ్యూటీ హాట్ అందాలు.. ఫోటోలు
కానీ, ఆమె అవేవి పట్టించుకోకుండా టాలీవుడ్ లో సినిమాలు మానేసి బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వస్తోంది. రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకుంది. అయితే, తాజాగా రకుల్ ప్రెజెంట్ లుక్ పై ఒక నెటిజన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆమె శరీర మార్పులకు కారణం ప్లాస్టిక్ సర్జరీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అయితే, ఆ పోస్ట్ రకుల్ వరకు చేరడంతో సీరియస్ అయ్యింది ఈ బ్యూటీ. “నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు జనాలను తప్పు దారి పట్టిస్తూ ఉంటారు. ఇది నిజంగా భయంకరమైన పని. సంప్రదాయ వైద్యం, ఆధునిక చికిత్స.. నేను రెండిటినీ నమ్ముతాను. ఒకవేళ ఎవరైనా సర్జరీలు చేయించుకున్నా దానిని తప్పు పట్టను. కానీ, వ్యాయామం చేసి కూడా బరువు తగ్గొచ్చు.. అది గుర్తుపెట్టుకోవాలి. అంటూ సీరియస్ గా రెస్పాండ్ అయ్యింది. దీంతో రకుల్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
