Ram Pothineni Bhagyashri Borse Upendra Andhra King Taluka Movie Title Glimpse Announced
RAPO 22 : గత కొన్నాళ్లుగా మాస్ సినిమాలు చేసినా అందులో కొన్ని నిరాశపరచడంతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మళ్ళీ తన పాత రూట్లోకి వెళ్లి చాక్లెట్ బాయ్ గా రాబోతున్నాడు. రామ్ 22 వ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మహేష్ బాబు దర్శకత్వంలో అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో ఉపేంద్ర ఒక హీరోగా, రామ్ ఆ హీరో అభిమానిగా కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది. తాజాగా నేడు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాకు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే టైటిల్ ప్రకటించారు. బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. గ్లింప్స్ లో రామ్ థియేటర్ కి వచ్చి టికెట్స్ అడిగి ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్తాడు. థియేటర్ దగ్గర సందడి, స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే టికెట్ల కోసం అడిగించడం.. ఇలాంటివన్నీ గ్లింప్స్ లో చూపించారు.
మీరు కూడా టైటిల్ గ్లింప్స్ చూసేయండి..
ఇక హీరో ఆంధ్ర కింగ్ పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారు. దీంతో ఇది లవ్ స్టోరీతో పాటు సినిమాలు, ఫ్యాన్స్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలా ఉండబోతుంది అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచాక అయన ఫ్యాన్స్, పిఠాపురం ప్రజలు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేవాళ్ళు. బైక్స్, కార్ల మీద కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాపించుకోవడంతో ఆ పేరు బాగా వైరల్ అయింది. ఆ తర్వాత దాన్ని ఇన్‌స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది తాలూకా అని రాసుకుంటున్నారు. ఇప్పుడు రామ్ సినిమాకు కూడా పిఠాపురం తాలూకా ఇన్‌స్పిరేషన్ తీసుకొని ఆంద్ర కింగ్ తాలూకా అని టైటిల్ పెట్టినట్టు ఉంది. దీంతో టైటిల్ కి మాత్రం మంచి రీచ్ వస్తుంది.
Also Read : Samantha : మరోసారి రాజ్ తో ‘సమంత’.. భుజంపై తలవాల్చి.. ప్రతిసారి సమంత హింట్స్ ఇస్తుందా?