రామ్ పోతినేని.. డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా రిలీజ్‌ డేట్ వచ్చేసింది.

Double ISMART movie release date announced

Double ISMART : హీరో రామ్ పోతినేని(Ram Pothineni) ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. ఇస్మార్ట్ శంకర్ (ISmart Shankar)కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ఆగస్టు 15న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నట్టు ఈరోజు మూవీ యూనిట్ ఎనౌన్స్ చేసింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ రోల్‌లో నటిస్తున్నారు.

పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో అలీ, షయాజీ షిండే, గెటప్ శ్రీను, ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. మణిశర్మ మ్యూజిక్.. శ్యామ్ కె నాయుడు, జియాని జియానెలి ఫొటోగ్రఫీ అందిస్తున్నారు.

Also Read: ‘మహారాజ’ మూవీ రివ్యూ.. విజయ్ సేతుపతి 50వ సినిమా ఎలా ఉందంటే..

ఇప్పటికే విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్‌ను కంటిన్యూ చేస్తూ ఈ సినిమా రూపొంచినట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

 

ట్రెండింగ్ వార్తలు