Ram Pothineni
Ram Pothineni : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని త్వరలో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జగపతిబాబు జయమ్ము నిశ్చయమ్మురా షోకి రామ్ పోతినేని వచ్చాడు. ఈ షోలో తన చిన్నప్పుడు జరిగిన సంఘటనల గురించి తెలిపాడు.
రామ్ పోతినేని మాట్లాడుతూ.. నేను పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టాను. మా నాన్న మ్యూజిక్ వీడియోలకు సంబంధించిన బిజినెస్ చేసేవారు. సోనీ కంపెనీ తరపున జపాన్ కూడా వెళ్లొచ్చారు అప్పట్లోనే. విజయవాడ లబ్బీపేటలో మాది చాలా పెద్ద ఇల్లు. 1988లో విజయవాడలో జరిగిన కుల ఘర్షణల్లో మా కుటుంబం చాలా నష్టపోయింది. అప్పటివరకు మా నాన్న సంపాదించింది అంతా ఆ క్యాస్ట్ గొడవల్లో పోయింది. దాంతో ఒక్క రోజులో జీరోకి వచ్చేసాం.
Also Read : Chiranjeevi : 24 ఏళ్ళ తర్వాత మళ్ళీ అలాంటి పాత్రలో మెగాస్టార్..? పండక్కి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్ కూడా..
ఇక అక్కడే ఉంటే కష్టం అని నాన్న మమ్మల్ని తీసుకొని చెన్నైకి వచ్చేసారు. చెన్నైలో చాలా చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ ఇల్లు విజయవాడలో నా బొమ్మల గది అంత కూడా ఉండదు. అన్ని కోల్పోయినా మళ్ళీ జీరో నుంచి సంపాదించాడు మా నాన్న. అందుకే ఆయనంటే నాకు ఇంకా ఎక్కువ గౌరవం. జీరో నుంచి ఎదిగి మళ్ళీ పడిపోయినా మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టి సంపాదించారు అని తెలిపాడు.