Ram Pothineni : రామ్ నెక్స్ట్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది.. మళ్ళీ చాక్లెట్ బాయ్ గా మారిన రామ్..

తాజాగా ఈ సినిమా నుంచి రామ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.

Ram Pothineni Next Movie First Look Released Shoot Begins

Ram Pothineni : గత కొన్నాళ్లుగా మాస్ సినిమాలు చేసి ఆశించినంత విజయాలు అందుకోకపోవడంతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మళ్ళీ తన పాత రూట్లోకి వచ్చేసాడు. ఇటీవల రామ్ 22 వ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మహేష్ బాబు దర్శకత్వంలో అనౌన్స్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి రామ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.

Also Read : Pushpa 2 Jathara Song : పుష్ప 2 నుంచి గంగమ్మ జాతర సాంగ్ రిలీజ్.. సాంగ్ విన్నారా?

ఈ ఫస్ట్ లుక్ లో ఒక సైకిల్ తో పాటు స్మార్ట్ గా క్లీన్ షేవ్, స్టైలిష్ హెయిర్ తో రామ్ ఉన్నాడు. ఈ ఫొటో చూస్తుంటే రామ్ మళ్ళీ తన రూట్ లోకి వచ్చి చాక్లెట్ బాయ్ లా మారి లవ్ స్టోరీతో వస్తున్నాడేమో అని తెలుస్తుంది. అలాగే ఇది పీరియాడిక్ సినిమా అని తెలుస్తుంది.

ఈ పోస్టర్ పై మీకు సుపరిచితుడు.. మీలో ఒకడు.. మీ సాగర్ అని ఉంది. అలాగే షూట్ మొదలైనట్టు ప్రకటించారు. ఈ సినిమాలో రామ్ సాగర్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది.