Pushpa 2 Jathara Song : పుష్ప 2 నుంచి గంగమ్మ జాతర సాంగ్ రిలీజ్.. సాంగ్ విన్నారా?
తాజాగా పుష్ప 2 సినిమాలోని జాతర సాంగ్ ని విడుదల చేసారు.

Allu Arjun Pushpa 2 Jathara Song Released
Pushpa 2 Jathara Song : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ హైలెట్ అని, అందులో అల్లు అర్జున్ నటన హైలెట్ అని అందరూ అంటున్నారు. చిత్తూరు గంగమ్మ జాతర నేపథ్యంలో ఆడవేషం కట్టి అల్లు అర్జున్ డ్యాన్స్ వేసే సీన్ ఉంటుంది. ఈ సీన్ లో అల్లు అర్జున్ తన డ్యాన్స్, నటనతో మెప్పిస్తాడు.
Also Read : Allu Arjun : నేడు పుష్ప 2 సక్సెస్ మీట్.. సంధ్య థియేటర్ ఘటనపై బన్నీ స్పందిస్తాడా?
అయితే సినిమా రిలీజ్ కి ముందు ఈ పాటను రిలీజ్ చేయలేదు. తాజాగా పుష్ప 2 సినిమాలోని జాతర సాంగ్ ని విడుదల చేసారు. కేవలం ఆడియో సాంగ్ ని మాత్రమే విడుదల చేసారు. ఈ పాటని చంద్రబోస్ రాయగా దేవిశ్రీ ప్రసాద్ దర్శకత్వంలో మహాలింగం పాడారు. మీరు కూడా ఈ జాతర సాంగ్ వినేయండి..