Allu Arjun : నేడు పుష్ప 2 సక్సెస్ మీట్.. సంధ్య థియేటర్ ఘటనపై బన్నీ స్పందిస్తాడా?

నేడు పుష్ప 2 సక్సెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.

Allu Arjun : నేడు పుష్ప 2 సక్సెస్ మీట్.. సంధ్య థియేటర్ ఘటనపై బన్నీ స్పందిస్తాడా?

Allu Arjun Pushpa 2 Success Meet waiting for Bunny Reactions

Updated On : December 6, 2024 / 9:49 AM IST

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా నిన్న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజయి మంచి సక్సెస్ తో దూసుకుపోతుంది. మొదటి రోజు కలెక్షన్స్ 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అంచనాలు వేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం సినిమా సక్సెస్ పై సంతోషంతో ఉన్నారు. అయితే మొన్న పుష్ప 2 ప్రీమియర్స్ వేయగా హైదరాబాద్ సంధ్య థియేటర్ కి ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడటానికి అల్లు అర్జున్, మూవీ టీమ్ వెళ్లారు.

అల్లు అర్జున్ రావడంతో అక్కడికి భారీగా అభిమానులు వచ్చారు. అయితే అల్లు అర్జున్ టీమ్, థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వస్తున్నట్టు పోలీసులకు సమాచారం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. భారీ సంఖ్యలో జనాలు ఉండటం, అల్లు అర్జున్ రాగానే అతని బౌన్సర్లు జనాల్ని నెట్టేయడంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతిచెందగా, ఆ మహిళ కుమారుడు స్పృహతప్పి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. ఇప్పటికే అల్లు అర్జున్ టీమ్ పై, థియేటర్ యాజమాన్యం పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read : Pushpa 2 Collections : పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చాయి? సినిమా ట్రేడర్స్ ఎంత చెప్తున్నారు?

దీనిపై అల్లు అర్జున్ టీమ్, మైత్రి నిర్మాతలు స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అని అన్నారు. రష్మిక కూడా సోషల్ మీడియాలో స్పందించింది కానీ ఈ ఘటనపై ఇప్పటివరకు అల్లు అర్జున్ స్పందించలేదు. నేడు పుష్ప 2 సక్సెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ సక్సెస్ మీట్ కి నిర్మాతలు, సుకుమార్ తో పాటు అల్లు అర్జున్, రష్మిక కూడా హాజరవ్వనున్నారు. దీంతో ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటన గురించి, మృతి చెందిన మహిళ గురించి, పోలీసుల కామెంట్స్ పై స్పందిస్తారా? లేక మీడియా నుంచి ఈ ఘటనపై ప్రశ్నలు ఎదురైతే సమాధానాలు ఇస్తారా అని ఆసక్తి నెలకొంది.