Pushpa 2 Collections : పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చాయి? సినిమా ట్రేడర్స్ ఎంత చెప్తున్నారు?
మొదట్నుంచి పుష్ప 2 సినిమా కలెక్షన్స్ విషయంలో అన్ని రికార్డులని బద్దలు కొట్టాలని చూస్తుంది.

Allu Arjun Pushpa 2 Movie Expected First Day Collections Details
Pushpa 2 Collections : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా నిన్న గ్రాండ్ గా రిలీజయింది. ముందురోజే ప్రీమియర్స్ కూడా వేశారు. మొదట్నుంచి పుష్ప 2 సినిమా కలెక్షన్స్ విషయంలో అన్ని రికార్డులని బద్దలు కొట్టాలని చూస్తుంది. ముఖ్యంగా మొదటి రోజు కలెక్షన్స్. మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా RRR 223 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో ఉంది. ఆ తర్వాత బాహుబలి 2, కల్కి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు పుష్ప 2 సినిమా ఈ రికార్డ్ ని బ్రేక్ చేసిందని సమాచారం.
మూవీ యూనిట్ అధికారికంగా ఇంకా కలెక్షన్స్ ప్రకటించలేదు. కానీ సినిమా ట్రేడర్స్ ప్రకారం పుష్ప 2 సినిమా ఆల్మోస్ట్ 280 కోట్ల నుంచి – 300 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 170 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వచ్చాయని సమాచారం. కచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా పుష్ప నిలుస్తుంది అని అంటున్నారు. అలాగే హిందీలో జవాన్, యానిమల్ సినిమాల ఓపెనింగ్ డేస్ కలెక్షన్స్ కూడా బద్దలుకొడుతుందని. ఒక్క హిందీ నుంచే 90 కోట్ల కలెక్షన్స్ రావొచ్చని సమాచారం.
Also Read : Balakrishna – Mokshagna : సినిమా ఆగిపోలేదురా బాబు.. మోక్షజ్ఞకు హెల్త్ బాగోలేదు.. బాలయ్య వ్యాఖ్యలు..
తెలుగు రాష్ట్రాల్లో 95 కోట్లకు పైగా, తమిళ్ లో 10 కోట్లకు పైగా, కన్నడలో 17 కోట్ల రూపాయలు, మలయాళంలో 7 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్ నుంచి ఇంకో 60 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రావొచ్చు. దీంతో ఆల్మోస్ట్ ఎన్నో ఏరియాలలో బాహుబలి, RRR ఇప్పటివరకు క్రియేట్ చేసిన మొదటి రోజు రికార్డులను, బాలీవుడ్ లో హిందీ సినిమాలు చేసిన రికార్డులను పుష్ప 2 తుడిచిపెట్టేసింది అంటున్నారు. మరి అధికారికంగా పుష్ప 2 మూవీ యూనిట్ ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్షన్స్ పోస్టర్ వేస్తుందో చూడాలి.