Balakrishna – Mokshagna : సినిమా ఆగిపోలేదురా బాబు.. మోక్షజ్ఞకు హెల్త్ బాగోలేదు.. బాలయ్య వ్యాఖ్యలు..
నిన్న ఓ షాప్ ఓపెనింగ్ ఈవెంట్లో పాల్గొన్న బాలకృష్ణకు ప్రశాంత్ వర్మ - మోక్షజ్ఞ సినిమా గురించి ప్రశ్న ఎదురైంది.

Balakrishna Gives Clarity on Mokshagna Prasanth Varma Movie
Balakrishna – Mokshagna : బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇటీవలే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిన్న డిసెంబర్ 5న జరగాల్సి ఉంది. అయితే నిన్న పూజా కార్యక్రమాలు జరగకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. దీనిపై బాలకృష్ణ స్పందించారు.
Also Read : Nagarjuna : ఏఎన్నార్ విగ్రహం ముందు కొత్త జంట.. ఇది నా కొడుకు పెళ్లి మాత్రమే కాదు అంటూ నాగ్ స్పెషల్ పోస్ట్..
నిన్న ఓ షాప్ ఓపెనింగ్ ఈవెంట్లో పాల్గొన్న బాలకృష్ణకు ప్రశాంత్ వర్మ – మోక్షజ్ఞ సినిమా గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి బాలయ్య సమాధానమిస్తూ.. సినిమా పూజా కార్యక్రమం ఇవాళ జరగాలి. జరగలేదు అంతే. వాతావరణం బాగోకపోవడం వల్ల మోక్షజ్ఞకు ఒంట్లో బాగోలేదు. రెండు రోజులుగా జ్వరం. పూజా కార్యక్రమమే కదా వచ్చేద్దాం అనుకున్నాడు కానీ నిన్నటి నుంచి మరింత ఎక్కువైంది అందుకే జరగలేదు. త్వరలోనే సినిమా మొదలవుతుంది అని తెలిపారు.
ఇవాళ సినిమా మొదలు పెట్టాల్సింది….కానీ ఆయనకి(#NandamuriMokshagna) ఒంట్లో బాగాలేకపోవడం వల్ల postpone చెయ్యటం జరిగింది..అంత మన మంచికే అనుకోవాలి.
– #NandamuriBalakrishna at a shop opening in Kakinada. pic.twitter.com/PtNBDm95lZ
— Gulte (@GulteOfficial) December 5, 2024
దీంతో బాలయ్య కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇండైరెక్ట్ గా సినిమా ఏమి ఆగిపోలేదురా బాబు అని అందరికి సమాధానం ఇచ్చారు బాలయ్య. ఇక నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.