Ramayan serial actress Dipika Chikhlia comments on Adipurush Kriti Sanon
Adipurush – Kriti Sanon : రామాయణ కథాంశంతో ప్రభాస్ (Prabhas) రాముడిగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా కనిపించబోతున్న ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ.. ఇటీవల తిరుపతిలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఆ ఈవెంట్ అనంతరం కృతి సనన్ అండ్ ఓం రౌత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే శ్రీవారి సన్నిధి ప్రాంగణంలో వారిద్దరూ కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి పనులు వివాదం అయ్యాయి.
Adipurush : ఓం రౌత్, కృతి ముద్దు వ్యవహారం.. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు ఆగ్రహం..
స్వామివారి శేష వస్త్రాలు ధరించి, శ్రీవారి సన్నిధి ప్రాంగణంలో ముద్దు పెట్టుకోవడం ఏంటని భక్తులతో పాటు పలువురు ప్రముఖులు కూడా తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే ‘రామాయణం’ సీరియల్ లో సీతగా నటించిన దీపికా చిక్లియా (Dipika Chikhlia) కామెంట్స్ చేశారు. “రామాయణ కథలో నటిస్తున్న మమ్మల్ని ప్రజలు దేవుళ్లుగా భావించేవారు. ఆ ఉద్దేశంతోనే మా కాళ్లకి నమస్కరించేవారు. వారి భక్తి భావన చూసిన మేము వారి నమ్మకానికి గౌరవం ఇచ్చేవాళ్ళం. హాగ్, ముద్దు పెట్టుకోవడం వంటివి చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఎప్పుడు ప్రవర్తించలేదు. కానీ ఈతరం నటీనటులు అంత డెడికేషన్ తో ఉండలేకపోతున్నారు” అంటూ వ్యాఖ్యానించారు.
Adipurush : ఆదిపురుష్ సినిమాకి దళితులకు ప్రవేశం లేదు.. స్పందించిన మూవీ టీం!
అయితే ఈ విషయం పై ఇప్పటి వరకు మూవీ టీం నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఇది ఇలా ఉంటే.. మరో సీనియర్ నటి కస్తూరి (Kasturi) ఆదిపురుష్ లోని ప్రభాస్ లుక్స్ గురించి కామెంట్స్ చేసింది. “ప్రభాస్ ని చూస్తుంటే నాకు రాముడు గుర్తుకు రావడం లేదు కర్ణుడు గుర్తుకు వస్తున్నాడు. ఏ ట్రెడిషన్ లో శ్రీరామలక్ష్మణులకు మీసాలు, గడ్డలు చూపించారు” అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్ పై ప్రభాస్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.