Ramayana : ర‌ణ్‌బీర్ సాయిప‌ల్ల‌వి రామాయ‌ణం.. రెండు పార్టులుగా.. రిలీజ్ ఎప్పుడంటే?

న‌టుడు ర‌ణ్‌బీర్ క‌పూర్ రాముడిగా సాయి ప‌ల్ల‌వి సీత‌గా బాలీవుడ్‌లో రామాయ‌ణం సినిమా తెర‌కెక్కుతోంది.

Ramayana officially announced to release in 2 parts

న‌టుడు ర‌ణ్‌బీర్ క‌పూర్ రాముడిగా సాయి ప‌ల్ల‌వి సీత‌గా బాలీవుడ్‌లో రామాయ‌ణం సినిమా తెర‌కెక్కుతోంది. దంగ‌ల్ ద‌ర్శ‌కుడు నితేశ్‌ తివారీ డైరెక్ష‌న్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ చిత్రం నుంచి సాలీడ్ అప్‌డేట్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తీసుకురాబోతున్నట్లు చిత్ర‌బృందం తెలియ‌జేసింది. తొలి భాగాన్ని దీపావ‌ళి కానుక‌గా 2026లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది.

ఇక రెండో భాగం విడుద‌ల తేదీని సైతం వెల్ల‌డించింది. రెండో భాగాన్ని 2027 దీపావ‌ళికి రిలీజ్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ విష‌యాల‌ను తెలియ‌జేస్తూ ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

Mohanlal – Mammootty : 16 ఏళ్ల త‌రువాత క‌లిసి న‌టిస్తున్న మ‌ల‌యాళ స్టార్ హీరోలు మ‌మ్ముట్టి, మోహ‌న్ లాల్‌.. షూటింగ్ ఎప్పుడంటే?

ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ వ్యవస్థాపకుడు నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. ‘5000 సంవత్సరాలకు పైగా కోట్లాది హృదయాలను పాలించిన ఈ ఇతిహాసాన్ని పెద్ద తెరపైకి తీసుకురావాలనే గొప్ప తపనను ప్రారంభించాను. మా బృందాలు అవిశ్రాంతంగా పని చేస్తున్నందున ఇది అందంగా రూపుదిద్దుకోవడం చూసి థ్రిల్ అయ్యాను. మన చరిత్ర, మన సత్యం, మన సంస్కృతికి అత్యంత ప్రామాణికమైన, పవిత్రమైన దృశ్యపరంగా అద్భుతమైన అనుసరణను ప్రదర్శించడం ఒకే ఒక ఉద్దేశ్యం.’ అని అన్నారు.

కెజిఎఫ్ స్టార్ యష్ రావణుడి పాత్రలో న‌టిస్తున్న‌ట్లు చిత్ర బృందం ఇప్ప‌టికే తెలియ‌జేసింది. కాగా.. హనుమంతుడిగా సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌ కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Sai Pallavi : మొన్నటిదాకా లేడీ పవర్ స్టార్.. కానీ ఇప్పుడు.. సాయి పల్లవికి కొత్త ట్యాగ్..