Sai Pallavi : మొన్నటిదాకా లేడీ పవర్ స్టార్.. కానీ ఇప్పుడు.. సాయి పల్లవికి కొత్త ట్యాగ్..
సాయి పల్లవి ఫ్యాన్ డమ్ చూసి డైరెక్టర్ సుకుమార్ ఆమెకు లేడీ పవర్ స్టార్ అని ట్యాగ్ ఇచ్చారు.

Sai Pallavi Lady Power Star Tag Changed to New Tag Here the Details
Sai Pallavi : మన హీరోలకు, కొంతమంది హీరోయిన్స్ కు కూడా స్టార్ ట్యాగ్స్ ఉంటాయని తెలిసిందే. అలాంటి హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరు. తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంది సాయి పల్లవి. సౌత్ లో మంచిమంచి కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ తన నటనతో ఫిదా చేస్తూ, తన డ్యాన్స్ తో అబ్బురపరుస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది సాయి పల్లవి. తెలుగులో కూడా ఈ అమ్మడికి ఫ్యాన్స్ ఎక్కువే. సినిమా ఈవెంట్స్ కి సాయి పల్లవి వస్తే ఫ్యాన్స్ చేసే హడావిడి మాములుగా ఉండదు.
సాయి పల్లవి ఫ్యాన్ డమ్ చూసి డైరెక్టర్ సుకుమార్ ఆమెకు లేడీ పవర్ స్టార్ అని ట్యాగ్ ఇచ్చారు. దీంతో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి అంటూ ఆ ట్యాగ్ బాగా వైరల్ అయింది. పలు సినిమా ఈవెంట్స్ లో, బయట కూడా ఆమెను లేడీ పవర్ స్టార్ అనే పిలుస్తున్నారు. సాయి పల్లవికి ఇష్టం లేకపోయినా ఆమెకు ఎలివేషన్ ఇవ్వడానికి అందరూ ఈ ట్యాగ్ వాడుతున్నారు. అయితే తాజాగా సాయి పల్లవికి కొత్త ట్యాగ్ ఇచ్చారు.
Also Read : Game Changer : ఏక్ నిరంజన్ దెబ్బకి సినిమాలు మానేసిన డిస్ట్రిబ్యూటర్.. గేమ్ ఛేంజర్‌తో రీ ఎంట్రీ!
నిన్న తండేల్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ ప్రెస్ మెట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. అమరన్ సక్సెస్ గురించి చెప్తూ సాయి పల్లవి క్వీన్ ఆఫ్ బాక్సాఫీసెస్ అని తనకు ఒకరు చెప్పారు అని తెలిపాడు. ఆ తర్వాత నాగచైతన్య కూడా క్వీన్ ఆఫ్ బాక్సాఫీసెస్ అని సాయి పల్లవి గురించి మాట్లాడాడు. దీంతో సాయి పల్లవి క్వీన్ ఆఫ్ బాక్సాఫీసెస్ అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా ఈ ట్యాగ్ తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల అమరన్ సినిమాలో సాయి పల్లవి తన నటనతో అందర్నీ కన్నీళ్లు పెట్టించింది. ఈ సినిమా ఏకంగా 150 కోట్లు కలెక్ట్ చేసింది. సాయి పల్లవి సినిమాల లిస్ట్ లో ఎక్కువగా హిట్ సినిమాలే ఉన్నాయ్. అందుకే ఆమెను క్వీన్ ఆఫ్ బాక్సాఫీసెస్ అన్నారేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హీరోలే కాదు హీరోయిన్స్ కూడా ఇలా కొత్త ట్యాగ్ లతో వైరల్ అవుతున్నారు.