Game Changer : ఏక్ నిరంజన్ దెబ్బకి సినిమాలు మానేసిన డిస్ట్రిబ్యూటర్.. గేమ్ ఛేంజర్‌తో రీ ఎంట్రీ!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్.

Aditya Ram Back into industry With Ram Charan Game changer Movie
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రాన్ని తమిళనాడులో ఆదిత్య రామ్ మూవీస్, ఎస్‌వీసీ సంస్థలు విడుదల చేయనున్నాయి.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు దిల్‌రాజు, ఆదిత్య రామ్‌లు మాట్లాడారు. ఆదిత్య రామ్ మాట్లాడుతూ.. ప్రభాస్ ఏక్‌నిరంజన్ మూవీ కారణంగా సినీ రంగం నుంచి గ్యాప్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. 10 సంవత్సరాల అనంతరం ఇప్పుడు దిల్‌రాజ్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చినట్లు చెప్పారు.
Spirit : ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత.. షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే?
‘ఆదిత్యరామ్ మూవీస్ లో నేను నాలుగు సినిమాలు చేశాను. ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమా నిర్మించిన తరువాత రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టేశాను. దాని వల్ల బ్రేక్ వచ్చింది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ఎస్‌వీసీతో కలిసి ఆదిత్యరామ్ మూవీస్ ఈ చిత్రాన్ని తమిళంలో రిలీజ్ చేస్తుంది.’అని ఆదిత్య రామ్ అన్నారు.
తమిళంతో పాటు పాన్ ఇండియా సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. దిల్‌రాజు విషయానికి వస్తే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో బ్లాక్ బస్టర్స్, హిట్ సినిమాలు చేసిన నిర్మాత ఆయన అని అన్నారు. ఆయనతో కలిసి మరెన్నో సినిమాలను నిర్మిస్తామన్నారు.
Sunny Leone : రెండో సారి పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్.. ఫొటోలు చూశారా?