Spirit : ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత.. షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే?
సలార్, కల్కి సినిమాల విజయాలతో మంచి జోష్‌లో ఉన్నారు ప్రభాస్.

Bhushan Kumar Major Update On Prabhas Spirit movie
సలార్, కల్కి సినిమాల విజయాలతో మంచి జోష్‌లో ఉన్నారు ప్రభాస్. ఈ క్రమంలో వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో స్పిరిట్ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ‘భూల్ భూలయ్యా 3’ ప్రమోషన్ ఇంటర్వ్యూలో స్పిరిట్ మూవీపై నిర్మాత భూషణ్‌కుమార్ అప్‌డేట్ ఇచ్చారు.
ప్రస్తుతం తాము స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో నటించే నటీనటులను ఇంకా ఎంపిక చేయలేదన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. ఆ తరువాత షూటింగ్ పనులను మొదలు పెట్టనున్నట్లు తెలిపారు.
Sharda Sinha : జానపద గాయని శారదా సిన్హా ఇకలేరు
డిసెంబర్ చివరిలో షూటింగ్‌ను ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆ తరువాత ఆరు నెలల గ్యాప్ ఉంటుందని, ఆ వెంటనే సందీప్ యానిమల్ పార్క్‌ను మొదలు పెడతారని చెప్పారు.
కాగా.. గతంతో ఈ చిత్రం గురించి సందీప్ వంగా మాట్లాడుతూ మొదటి రోజే ఈ మూవీ 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టనుందనే ధీమాను వ్యక్తం చేశారు. ప్రభాస్ ఈ మూవీలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నారన్నారు. ప్రభాస్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని కొనియాడారు. ఆయన్ని చూపించే విధానం గనుక ప్రేక్షకులకు నచ్చితే చాలని, మూవీ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందన్నారు.
Jhansi Daughter : నటి, యాంకర్ ఝాన్సీ కూతుర్ని చూశారా..? ఇంత మంచి డ్యాన్సరా..? సినిమాల్లోకి ఎంట్రీ..?