Mohanlal – Mammootty : 16 ఏళ్ల తరువాత కలిసి నటిస్తున్న మలయాళ స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్.. షూటింగ్ ఎప్పుడంటే?
మలయాళ సూపర్ స్టార్లు మోహన్ లాల్, మమ్ముట్టిలు దాదాపు 16 ఏళ్ల తరువాత కలిసి ఓ సినిమాలో నటించనున్నారు.

Mohanlal and Mammootty reunite after 16 years for upcoming film
మలయాళ సూపర్ స్టార్లు మోహన్ లాల్, మమ్ముట్టిలు దాదాపు 16 ఏళ్ల తరువాత కలిసి ఓ సినిమాలో నటించనున్నారు. మహేశ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ చిత్రం పై ఓ న్యూస్ వైరల్‌గా మారింది. డిసెంబర్‌లో ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు సదరు వార్త సారాంశం. అయితే.. దీనిపై చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.
మమ్ముట్టి కంపెనీ, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నాయి. దాదాపు 30 రోజుల పాటు శ్రీలంకలో ఈ చిత్ర షూట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Sai Pallavi : మొన్నటిదాకా లేడీ పవర్ స్టార్.. కానీ ఇప్పుడు.. సాయి పల్లవికి కొత్త ట్యాగ్..
ఇప్పటికే లొకేషన్ పరిష్మన్ కోసం నిర్మాతలు లంక ప్రధానితో చర్చలు జరిపినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. కథా పరంగా ఈ చిత్ర షూటింగ్ మేజర్ పార్ట్ శ్రీలంకలో, మిగతాది కేరళ, ఢిల్లీ, లండన్‌లోనూ జరగనుంది.
కాగా.. మోహన్ లాల్, మమ్ముట్టిలు కలిసి దాదాపు 50 పైగా చిత్రాల్లో భిన్నపాత్రల్లో నటించారు. చివరి సారి ‘కాథల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ అనే చిత్రంలో సిల్వర్ స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు. ఇన్నేళ్ల తరువాత వీరిద్దరు కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మలయాళ సినీ చరిత్రలో ఈ మూవీ సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
Spirit : ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత.. షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే?