Ramcharan remembered his childhood teacher and went home to meet him
Ram Charan: ఒక సూపర్ స్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, భారతీయ సినీ రంగంలో మరే స్టార్ హీరో కొడుకు సాధించలేని స్టార్ డమ్ ని సంపాదించుకున్న నటుడు టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఇక “ఆర్ఆర్ఆర్” సినిమాలో తన నటవిశ్వరూపానికి ప్రపంచ సినీ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యిపోయి, గ్లోబల్ స్టార్ గా మన్ననలు అందుకుంటున్నాడు.
Ram Charan: మహేష్, ప్రభాస్ లను అధిగమించిన చరణ్..
అయితే ఎంత ఎదిగిన ఒదిగే ఉండే మాటకు రామ్ చరణ్ చక్కనైన నిదర్శనం. తన తోటి కళాకారులను, అభిమానులను గుర్తుపెట్టుకొని మరి మంచి చెడ్డలు అడిగే అతడి మనస్తత్వం గురించి మనం చాలా సందర్భాల్లో చాలామంది దగ్గర విన్నాం. తాజాగా చరణ్ చిన్ననాటి గురువుని గుర్తుపెట్టుకొని మరి ఇంటికి వెళ్లి కలిశాడట.
ఇటీవల రాజమండ్రి పరిసరాల్లో RC15 షూటింగ్ జరుపుకోగా.. ఆ సమయంలో తనకి చిన్నప్పుడు చదువు చెప్పిన టీచరమ్మ.. ఆ చుట్టూ పక్క ప్రాతంలో నివసిస్తున్నారని తెలుసుకొని, ఆమె ఇంటి అడ్రెస్స్ కనుకొని మరి వెళ్లి కలుసుకున్నాడట. ఈ వార్త విన్న మెగాపవర్ స్టార్ అభిమానులు, మా చరణ్ బాబు బంగారం రా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.