ramdas athawale about Tunisha Sharma suicide
Tunisha Sharma : బాలీవుడ్ యాక్ట్రెస్ ‘తునీషా శర్మ’ సూసైడ్ నార్త్‌లో తీవ్ర దుమారాన్ని లేపుతుంది. సినిమా అండ్ సీరియల్స్ నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న తునీషా షూటింగ్ సెట్ లోనే ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ కలిచివేసింది. ఇక ఈ కేసుని దర్యాప్తు చేసిన పోలీసులు లవ్ బ్రేకప్ కారణంతోనే ఆమె సూసైడ్ చేసుకున్నట్లు ధ్రువీకరించారు. దీనికి కారణమైన షీజాన్ మహమ్మద్ ఖాన్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఇక ఈ ఘటన గురించి సినీ, రాజకీయ ప్రముఖులు స్పందింస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. తుణీషాది హత్యగా అభివర్ణించింది. ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ ప్రధాని మోదీని కోరింది. ఇప్పుడు దీనిపై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కూడా స్పందించారు. నిన్న తునీషా తల్లిని కలిసిన రాందాస్.. ‘తునీషా ఆత్మహత్యకి కారణమైన షీజాన్ మహమ్మద్ ఖాన్‌ని ఉరి తియ్యాలి’ అంటూ వ్యాఖ్యానించాడు.
అలాగే భాదిత కుటుంబానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కాగా తునీషా శర్మకి న్యాయం జరిగేలా చూస్తామని కేంద్ర సామజిక న్యాయ శాఖా మంత్రి కూడా హామీ ఇచ్చాడు. ఇక పోలిసుల విచారణలో షీజాన్‌కి ఒక సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించనున్నారు.