Ramgopal Varma: ప్రేక్షకులు థియేటర్లకు రాకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఆర్జీవీ

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభుత్వానికీ, సినీ నిర్మాతల మధ్య కొనసాగుతున్న వివాదంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు.

Verma

Ramgopal Varma: ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభుత్వానికీ, సినీ నిర్మాతల మధ్య కొనసాగుతున్న వివాదంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. టిక్కెట్ల ధరలపై తన అభిప్రాయాన్ని యూట్యూబ్ వేదికగా వర్మ పంచుకున్నారు. టికెట్ ధరల తగ్గింపు విధానంపై సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆర్జీవీ పేర్కొన్నారు. ఎవరో ఇద్దరు అగ్ర హీరోలపై కక్ష సాధింపుగా ప్రభుత్వం ఇలా చేస్తుందని తాను భావించడం లేదన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల సినీ పరిశ్రమతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినే అవకాశముందని వర్మ హెచ్చరించారు.

Also read: Singareni Accident: భూపాలపల్లి సింగరేణి కేటీకే-5వ ఇంక్లైన్ లో తప్పిన ముప్పు

తెలుగు సినిమా కథానాయకుల పారితోషకాలపై మంత్రులు చేసిన వ్యాఖ్యాలపై వర్మ స్పందిస్తూ.. అనాదిగా హీరో ఇజం మెండుగా ఉన్న సినిమాలకే అలవాటు పడ్డ సగటు ప్రేక్షకులు, తమ అభిమాన హీరోలను చూడటానికి మాత్రమే సినిమాలకు వస్తారని అన్నారు. బడ్జెట్, ఇతరాత్ర విషయాలు ప్రేక్షకులకు అక్కర్లేదని ఆర్జీవీ తెలిపారు. తమ ఆర్థిక స్థోమతనుబట్టి ఇష్టమొచ్చిన థియేటర్లో ప్రేక్షకులు సినిమా చూస్తారని, ప్రభుత్వం ధర తగ్గించినా పెంచినా అది ప్రేక్షకుడి ఇష్టం పై ఆధారపడి ఉంటుందని రాంగోపాల్ వర్మ అన్నారు. ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రాకపోతే నిర్మాతలకు నష్టం వాటిల్లితుందని అందుకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని రాంగోపాల్ వర్మ అన్నారు.

Also read: RRR Postpone: కొత్త సంవత్సరం కలిసొస్తుందనుకున్నా.. కలగానే మిగిల్చిన ఆర్ఆర్ఆర్