Singareni Accident: భూపాలపల్లి సింగరేణి కేటీకే-5వ ఇంక్లైన్ లో తప్పిన ముప్పు

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కేటీకే 5వ గనిలో పెను ప్రమాదం తప్పింది. బొగ్గుగని ఫస్ట్ షిఫ్ట్ లోని 11వ డీపీ వద్ద భారీగా నీరు చేరుకుంది

Singareni Accident: భూపాలపల్లి సింగరేణి కేటీకే-5వ ఇంక్లైన్ లో తప్పిన ముప్పు

Singereni

Updated On : January 2, 2022 / 5:20 PM IST

Singareni Accident: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కేటీకే 5వ గనిలో పెను ప్రమాదం తప్పింది. బొగ్గుగని ఫస్ట్ షిఫ్ట్ లోని 11వ డీపీ వద్ద భారీగా నీరు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన కార్మికులు ఇంక్లైన్ నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో ఎవరు గాయపడలేదు. గనిలోకి నీరు చేరుకోవడంపై ముందస్తు సమాచారం లేకపోవడం ఆందోళనకు గురిచేస్తుంది. కార్మికులు విధులకు వెళ్లే ముందు ఇంజినీర్లు గనికి సంబంధించి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి నివేదిక ఇచ్చారా లేదా అనే విషయం తెలియరాలేదు.

Also read: Minister KTR: సీసీఐని తిరిగి తెరవాలంటూ కేంద్ర మంత్రులకు కేటీఆర్ లేఖ

కాగా గనిలోపలోకి భారీగా నీరు చేరుకోవడంతో 150HP మోటార్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఒక్కో మోటార్ విలువ సుమారు 50 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ప్రమాదంలో మొత్తం కోటి రూపాయలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తుంది. కాగా ప్రమాదంపై సింగరేణి అధికారులు గోప్యత పాటించారు. మీడియాకు సమాచారం అందకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. ఇక ఈప్రమాదంపై సింగరేణి విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.

Also Read: Tirumala News: తిరుమల ఘాట్ రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్, భక్తుల అవస్థలు