Tirumala News: తిరుమల ఘాట్ రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్, భక్తుల అవస్థలు

చిత్తూరు జిల్లా తిరుమల ఘాట్ రోడ్డుపై ఆదివారం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రెండో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించడంతో.. ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి

Tirumala News: తిరుమల ఘాట్ రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్, భక్తుల అవస్థలు

Tirumal;a

Tirumala News: చిత్తూరు జిల్లా తిరుమల ఘాట్ రోడ్డుపై ఆదివారం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రెండో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించడంతో.. ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో తిరుమలకు వెళ్లే వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు రెండున్నర గంటలపాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినట్లు వాహనదారులు పేర్కొన్నారు. దీంతో కొండపైకి వెళ్లే మిగతా వాహనదారులు సైతం అలిపిరి సమీపంలోనే ఆగిపోయారు. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవడం, అధికారులెవరూ పట్టించుకోకపోవడంపై కొండపైకి వెళ్లే వాహనదారులు, భక్తులు అసహనం వ్యక్తం చేసారు. అయితే రెండున్నర గంటల అనంతరం.. ఆగిన వాహనాలను తిరుమలకు అనుమతించడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది.

Also read: Crime News: కోవిడ్ టీకా అంటూ వ్యక్తిని తీసుకెళ్లి కుటుంబ నియంత్రణ చికిత్స చేసిన వైనం

గత నెల రోజులుగా ఘాట్ రోడ్డు పై ఇదే విధంగా వాహనాలు నిలిచిపోతున్నాయని స్థానిక వాహనదారులు పేర్కొన్నారు. లింక్ రోడ్డు పై వాహనాలను మళ్లించిననాటి నుంచి నిత్యం గంటపాటు ఇదే విధంగా ట్రాఫిక్ అవుతుందంటూ స్థానిక క్యాబ్ డ్రైవర్లు వాపోయారు. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో తిరుమలకు వెళ్లే స్థానికులకు, టీటీడీ ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అధికారులు, పోలీసులు స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Also read: Y V Subbareddy: అన్నమయ్య మార్గం అభివృద్ధికి టీటీడీ ప్రణాళికలు