Crime News: కోవిడ్ టీకా అంటూ వ్యక్తిని తీసుకెళ్లి కుటుంబ నియంత్రణ చికిత్స చేసిన వైనం

కరోనా టీకా వేయిస్తామంటూ వ్యక్తిని తీసుకెళ్లి, కుటుంబ నియంత్రణ చికిత్స చేసిన దారుణ ఘటన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది

Crime News: కోవిడ్ టీకా అంటూ వ్యక్తిని తీసుకెళ్లి కుటుంబ నియంత్రణ చికిత్స చేసిన వైనం

Cheating

Crime News: కరోనా టీకా వేయిస్తామంటూ వ్యక్తిని తీసుకెళ్లి, కుటుంబ నియంత్రణ చికిత్స చేసిన దారుణ ఘటన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉదయ్ పూర్ జిల్లా ప్రతాప్ నగర్ కు చెందిన కైలాష్ పుత్ర బాబూలాల్ అనే దినసరి కూలీ..డిసెంబర్ 29న కూలీ పనికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన నరేష్ అనే వ్యక్తి.. బాబూలాల్ ని మాటల్లోపెట్టి.. కోవిడ్ టీకా వేయించుకుంటే రూ.2000 ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. తాన రోజుకూలీ కంటే ఎక్కువ డబ్బు వస్తుండడంతో.. నరేష్ మాటలు నమ్మి అతనితో స్థానిక ఆసుపత్రికి వెళ్ళాడు. ఆసుపత్రి సిబ్బంది బాబూలాల్ కు మత్తు ఇంజక్షన్ ఎక్కించి.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసారు.

Also Read: Y V Subbareddy: అన్నమయ్య మార్గం అభివృద్ధికి టీటీడీ ప్రణాళికలు

నరేష్ మాటలు నమ్మి మోసపోయాయని గ్రహించిన అమాయకపు బాబూలాల్.. జరిగిన విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాడు. ఘటనపై కేసు నమోదు చేసిన భూపాల్ పూర్ పోలీసులు, శస్త్రచికిత్స చేసిన ఆసుపత్రి వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. నరేష్ ఎందుకు బాబూలాల్ ని టార్గెట్ చేసాడు? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుంటే.. బాబూలాల్ తన ఒక్కగానొక్క కుమారుడని.. అతనికి పెళ్ళైనా ఇంకా సంతానం కూడా కలగలేదంటూ బాబూలాల్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

Also read: Mohan Babu : రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశావ్..? : మోహన్‌ బాబు