Y V Subbareddy: అన్నమయ్య మార్గం అభివృద్ధికి టీటీడీ ప్రణాళికలు

కడప జిల్లాలోని బాలుపల్లి, కుక్కల దొడ్డి సమీపంలో అన్నమయ్య మార్గం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు

Y V Subbareddy: అన్నమయ్య మార్గం అభివృద్ధికి టీటీడీ ప్రణాళికలు

Annamayya Raod

Y V Subbareddy: కడప జిల్లాలోని బాలుపల్లి, కుక్కల దొడ్డి సమీపంలో అన్నమయ్య మార్గం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం కుక్కలదొడ్డి సమీపంలోనున్న అన్నమయ్య మార్గాన్ని టీటీడీ అధికారులు, స్థానిక రెవిన్యూ అధికారులతో కలిసి వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. అన్నమయ్య మార్గం ద్వారా సొంత వాహనాలు, కాలినడకన తిరుమలకు చేరుకునే భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేలా రోడ్డును అభివృద్ధి చేస్తామని టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా మామండూరు నుండి 23 కిలోమీటర్ల మేర ప్రణాళికలు తయారు చేయాలని.. అన్నమయ్య మార్గాన్ని సమగ్రంగా సర్వేచేసి అనుమతుల కొరకు అటవీశాఖకు ప్రతిపాదనలు పంపాలని రెవిన్యూ అధికారులకు సూచించారు.

Also Read: Mohanbabu : ఏపీ మంత్రి అవంతిపై నటుడు మోహన్‌ బాబు ఛలోక్తులు

ఈమార్గాన్ని అభివృద్ధి చేస్తే కడప జిల్లా మీదుగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఏదైనా ప్రకృతి ఉపద్రవాలు జరిగినపుడు ప్రత్యామ్నాయంగా అన్నమయ్య మార్గం ఉపయోగపడుతుందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తిరుపతి, తిరుమల కొండపైనా.. భారీ వర్షాలు కురిశాయి. తిరుమల కొండకు చేరుకునే రోడ్లు, ఇతర కాలిబాటలు రూపురేఖల్ని కోల్పోయాయి. దీంతో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, తిరుమల కొండకు భక్తులు చేరుకునేందుకు ప్రత్యామ్న్యాయ మార్గాల పై టీటీడీ దృష్టిపెట్టింది

Also read: Vellampalli: చంద్రబాబు చెప్పినట్టు రాధా చేస్తున్నారు: మంత్రి వెల్లంపల్లి