‘‘క్వీన్ ఆఫ్ తెలుగు సినిమా..సిల్వర్ స్క్రీన్ శివగామి’’ 50th బర్త్‌డే సెలబ్రేషన్స్..

  • Published By: sekhar ,Published On : September 15, 2020 / 02:34 PM IST
‘‘క్వీన్ ఆఫ్ తెలుగు సినిమా..సిల్వర్ స్క్రీన్ శివగామి’’ 50th బర్త్‌డే సెలబ్రేషన్స్..

Updated On : September 15, 2020 / 2:50 PM IST

Ramya Krishna 50th Birthday Birthday Celebrations: కొంతమంది కథానాయికలను చూస్తే ఏజ్ అనేది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే అనిపిస్తుంటుంది.. ముప్ఫై, నలభై దాటినా, పెళ్లై పిల్లలున్నా వారిలో ఏమాత్రం మార్పు కనిపించదు.. సాధారణంగా వయసు పెరిగే కొద్ది ఆ ఛాయలు ఎదుటి వారికి ఇట్టే తెలిసిపోతుంటుంది. కానీ కొందరిని చూస్తే అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంటారు. రెండో కేటగిరికి చెందిన వారిలో రమ్యకృష్ణ ఒకరు.



https://10tv.in/gautham-ghattamaneni-received-wishes-from-his-family/
మంగళవారం(సెప్టెంబర్‌ 15) న ‘‘క్వీన్ ఆఫ్ తెలుగు సినిమా..సిల్వర్ స్క్రీన్ శివగామి’’ రమ్యకృష్ణ పుట్టినరోజు. ఇది ఆమె 50వ పుట్టినరోజు. తన కుటుంబ సభ్యులతో కలిసి రమ్యకృష్ణ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌ను జరుపుకున్నారు.


భర్త కృష్ణవంశీ, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతోకలిసి ఉన్న ఫొటోను రమ్యకృష్ణ షేర్‌ చేశారు. తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో దాదాపు 260 కు పైగా చిత్రాల్లో రమ్యకృష్ణ ప్రేక్షకులను మెప్పించారు. స్టార్‌ హీరోయిన్‌గా అగ్ర కథానాయకులందరితోనూ నటించారు.


హీరోయిన్‌గానే కాదు.. ‘నరసింహా’ చిత్రంలో నీలాంబరి, ‘బాహుబలి’ చిత్రంలో శివగామి వంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారు. రమ్యకృష్ణ 50వ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్‌డే విషెస్ తెలియచేస్తున్నారు.

https://www.instagram.com/p/CFIMvtpjdH9/?utm_source=ig_web_copy_link