×
Ad

Ramya Moksha: కొడైకెనాల్ లో షూటింగ్.. ఇంట్లో నాన్న మరణం.. సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్.. ఇవన్నీ చూసి..

రమ్య మోక్ష అంటే చాలా మందికి తెలియక పోవచ్చు కానీ, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య(Ramya Moksha) అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో ఉండే వారందరికీ బాగా తెలుసు.

Ramya Moksha makes emotional comments about her journey

Ramya Moksha: రమ్య మోక్ష అంటే చాలా మందికి తెలియక పోవచ్చు కానీ, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో ఉండే వారందరికీ బాగా తెలుసు. ట్రేండింగ్ రీల్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. (Ramya Moksha)ఇక కుర్రకారులో ఈ అమ్మడుకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇది చాలా మంది అవాక్కయ్యారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి కారణం ఈ మధ్య ఆమె తీవ్రంగా ట్రోల్ అవడమే. బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన రమ్య మోక్ష తనకు ఎదురైన బాధాకరమైన సంఘటనలను ఆడియన్స్ తో పంచుకుంది.

Yellamma: బ్యాడ్ లక్.. ‘ఎల్లమ్మ’ నుంచి నితిన్ అవుట్.. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హీరోకి ఛాన్స్

ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. నేను ఫిట్ నెస్ వీడియోలతో ఫేమస్ అయ్యాను. ఆ ఫేమ్ తోనే పచ్చళ్ల బిజినెస్ స్టార్ట్ చేశాము. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సమయంలోనే ఒక సినిమాలో అవకాశం వచ్చింది. షూటింగ్ కోసం కొడైకెనాల్ వెళ్లాను. పూర్తి చేసుకొని వచ్చేసరికి నాన్న చనిపోయారు. ఆయన చివరి చూపు కోసం చాలా ఇబ్బంది పడాల్సివచ్చింది. ఆ సంఘటన జరిగిన రెండు వారాలకే పచ్చళ్ల బిజినెస్ కి సంబందించిన ఆడియో లీక్ అయింది. సోషల్ మీడియాలో మమ్మల్ని చాలా ట్రోల్స్ చేశారు. తిట్టారు కూడా. దాంతో, మా బిజినెస్ క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. నిజానికి మెం చేసింది తప్పే. దానికి నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాం. అందుకే, కెరీర్ మీద ఫోకస్ చేద్దామని బిగ్ బాస్ కి వచ్చాను. ఇక్కడ గెలిచి నేను ఏంటో చూపిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది రమ్య మోక్ష. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.