Ramya Moksha was eliminated from Bigg Boss Season 9.
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9లో వారానికో ట్విస్ట్ ఇస్తున్నాడు బిగ్ బాస్. ముందు నుంచి చెప్తున్నట్టుగా ఈ సీజన్ కాస్త కొత్తగా సాగుతోంది. వైల్డ్ కార్డు ఎంట్రీ తరువాత ఆ ఎంటర్టైన్మెంట్ ఇంకాస్త ఎక్కువ అయ్యింది. ఆలాగే, చాలా విషయాల్లో ఆడియన్స్ చిరాకు కూడా పడుతున్నారు. చిన్న దానికి, పెద్ద దానికి వాదనలు చేసుకుంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. కానీ, ఆడియన్స్ ని మాత్రం ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ కి మరోసారి ఇమ్మాన్యుయేల్ కెప్టెన్(Bigg Boss 9 Telugu) అయ్యాడు. దీంతో అతని గ్రాఫ్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. ఇక ఈవారం ఎలిమినేషన్ విషయానికి వస్తే.. మిడ్ వీక్ లో అయేషా ఇంటి నుంచి బయటకు వెళ్ళింది.
Pradeep Ranganathan: ప్రదీప్ కి టైం ఇవ్వని మహేష్ బాబు.. మొదటి ప్రాజెక్టు అలా మిస్ అయ్యిందట..
తనకు టైఫాయిడ్ అటాక్ అవడంతో మధ్యలోనే ఆమెను ఇంటికి పంపించాడు బిగ్ బాస్. దాంతో, ఈవారం ఎలిమినేషన్ ఉండదని అనుకున్నారు అంతా. కానీ, అనూహ్యంగా వీకెండ్ లో రెండో ఎలిమినేషన్ కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఈవారం అఫీషయల్ ఎలిమినేషన్ గా రమ్య మోక్ష బయటకు వెళ్లినట్టు సమాచారం. దీనికి సంబందించిన షూట్ కూడా ఇప్పటికే జరిగిపోయింది. నిజానికి గత వారమే రమ్య మోక్ష ఎలిమినేట్ అవుతుంది అని అనుకున్నారు అంతా. కానీ, అనూహ్యంగా భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యారు.
ఇక రమ్య మోక్ష విషయానికి వస్తే, ఆమె బిగ్ బాస్ హౌస్ లో రెండు వారాలు ఉన్నారు. ఈ రెండు వారాలకు గాను రమ్య రూ.3 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుననట్టుగా తెలుస్తోంది. ఇక ఈ వరం డబుల్ ఎలిమినేషన్ జరిగింది కాబట్టి, అయేషాను మళ్ళీ తీసుకువస్తారా అనేది అనుమానమే. అందుకే, ఎలాంటి రీజన్ లేకుండా ఎలిమినేట్ అయినా దమ్ము శ్రీజను మళ్ళీ ఇంట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే వారం మిడ్ వీక్ లో ఆమె ఇంట్లోకి రానుందట. మరి దమ్ము శ్రీజ రీ ఎంట్రీ తరువాత బిగ్ బాస్ మరింత వైలెంట్ గా మారనుంది.