క్రేజీ ఎనర్జీతో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే హీరోలు రానా – రవితేజ. ఈ ఇద్దరి సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. అలాంటిది ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే ..ఫుల్ ఫ్లెడ్జ్ గా మల్టీస్టారర్ చేస్తే..అబ్బో..ఆ విజువల్ ట్రీట్ అదిరిపోవడం గ్యారంటీ. మల్టీస్టారర్స్ మళ్లీ స్పీడందుకుంటున్నాయి టాలీవుడ్ లో. సోలోగా హిట్ కొట్టడానికి కాస్త ఇబ్బందిపడుతున్న హీరోలు ..అదిరిపోయే రీమేక్ తో మల్టీస్టారర్ చెయ్యబోతున్నారు. మళయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ ..సినిమా హిందీ రైట్స్ ని జాన్ అబ్రహం కొనేసుకుంటే ..తెలుగు రైట్స్ మాత్రం సితార ప్రొడక్షన్స్ దక్కించుకుందని టాక్ నడుస్తోంది.
సితార ప్రొడక్షన్స్ .. అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ కోసం హీరోలను వెతకే పనిలో పడ్డారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చెయ్యడానికి సరిపడే హీరోలు రానా, రవితేజ అని ఫిక్స్ అయ్యారట మేకర్స్. పృధ్విరాజ్, బిజుమీనన్ నటించిన ఈ హైలీ యాక్షన్ ఎలివేటెడ్ సినిమాని ఈ క్రేజీ హీరోలు హ్యాండిల్ చెయ్యగలరని, ఆ రేంజ్ లో క్యారెక్టర్స్ ని మ్యాచ్ చేస్తారని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. పోలీస్ ఆఫీసర్ గా రవితేజ, మాస్ హీరోగా రానా చేస్తే బావుంటని డిస్కషన్స్ నడుస్తున్నాయట.
సాచి డైరెక్షన్లో మళయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ .. స్టోరీ డ్రివెన్ మూవీ. దీన్లో హీరోల్ని అనవసరంగా ఎలివేట్ చెయ్యాల్సిన అవసరం లేదు. జస్ట్ కథతో పాటే ట్రావెల్ అయ్యే క్యారెక్టర్లు కాబట్టి.. భారీ ఇమేజ్ ఉన్న హీరోలు కాకుండా ..ఆ క్యారెక్టర్స్ ని మ్యాచ్ అయ్యే మాస్ అప్పీల్ ఉన్న రానా, రవితేజ అయితే యాప్ట్ అవుతారని, వీళ్లని హ్యాండిల్ చేసే డైరెక్టర్ కోసం సితార బ్యాచ్ వెతుకుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా వస్తే..అది ఇంట్రస్టింగ్ గా ఉండడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్.
Read: Green India Challenge : హామీ ఇచ్చిన ప్రభాస్..ఎవరిని నామినేట్ చేశారో తెలుసా