హనీమూన్‌లో రానా, మిహీకా!

  • Publish Date - October 17, 2020 / 08:08 PM IST

Rana Daggubati-Miheeka Bajaj: ఈ లాక్‌డౌన్‌ సమయంలో టాలీవుడ్‌కు చెందిన యంగ్‌ హీరోలు ఓ ఇంటివారయ్యారు. నితిన్‌, నిఖిల్‌తో పాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రానా దగ్గుబాటి కూడా పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి తర్వాత రానా, మిహీకా బజాజ్‌ జంట గురించిన వార్తలు పెద్దగా రాలేదు కానీ తాజాగా ఈ కపుల్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

రానా భార్య మిహీకా బజాజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పిక్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఫొటో చూస్తే వీరిద్దరూ హనీమూన్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. జస్ట్ బికాజ్ రానా అంటూ ఈ సెల్ఫీ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది మిహీకా.