రౌద్రవంగా రానా లుక్ – మూడు భాషల్లో విడుదల..

రానా దగ్గుబాటి నటిస్తున్న హిందీ చిత్రం ‘హాథీ మేరీ సాథీ’ తెలుగు, తమిళ్ భాషల్లోనూ విడుదల కానుంది..

  • Published By: sekhar ,Published On : February 10, 2020 / 01:08 PM IST
రౌద్రవంగా రానా లుక్ – మూడు భాషల్లో విడుదల..

Updated On : February 10, 2020 / 1:08 PM IST

రానా దగ్గుబాటి నటిస్తున్న హిందీ చిత్రం ‘హాథీ మేరీ సాథీ’ తెలుగు, తమిళ్ భాషల్లోనూ విడుదల కానుంది..

రానా దగ్గుబాటి.. ‘బాహుబలి’ తర్వాత చెయ్యబోయే సినిమాల విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటున్నాడు. క్యెరెక్టర్ కోసం బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడం రానాకి వెన్నతో పెట్టిన విద్య. బాహుబలిలో భారీ కాయంతో కనపించిన రానా, ఎన్టీఆర్ బయోపిక్ కోసం స్లిమ్ అయ్యాడు. నారా చంద్రబాబు నాయుడు గెటప్‌లో అందరినీ సర్‌ప్రైజ్ చేసాడు.

ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన రానా ప్రస్తుతం తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తున్నాడు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ‘హథీ మేరే సాథీ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో నిర్మిస్తోంది. తాజాగా తమిళ్, తెలుగు టైటిల్స్ ప్రకటిస్తూ రానా లుక్ రిలీజ్ చేశారు.

 

HINDI

 

తమిళ్‌లో ‘కాదన్’, తెలుగులో ‘అరణ్య’ పేరుతో ఈ సినిమా తెరెక్కెతోంది. పోస్టర్‌లో రానా డిఫరెంట్‌ వేషధారణ, హావభావాలతో అగ్రెసివ్‌గా కనిపిస్తున్నాడు. జోయా హుస్సేన్‌, శ్రియా పిల్గావుంకర్‌, పుల్‌కిత్‌ సామ్రాట్‌, విష్ణు విశాల్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా అధిక భాగాన్ని కేరళ అడవుల్లో చిత్రీకరించారు. ఆస్కార్‌ విజేత రసూల్‌  సౌండ్‌ ఇంజినీర్‌గా పనిచేశాడు. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఏప్రిల్ 2న ఈ సినిమా మూడు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

TAMIL