హథీ మేరె సాథీలో రానాని చూసారా?
'హథీ మెరె సాథీ' సినిమా లొకేషన్ నుండి రానా పిక్ ఒకటి లీక్ అయ్యింది..

‘హథీ మెరె సాథీ’ సినిమా లొకేషన్ నుండి రానా పిక్ ఒకటి లీక్ అయ్యింది..
రానా దగ్గుబాటి.. బాహుబలి తర్వాత చెయ్యబోయే సినిమాల విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటున్నాడు. క్యెరెక్టర్ కోసం బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడం రానాకి వెన్నతో పెట్టిన విద్య. బాహుబలిలో భారీ కాయంతో కనపించిన రానా, ఎన్టీఆర్ బయోపిక్ కోసం స్లిమ్ అయ్యాడు. నారా చంద్రబాబు నాయుడు గెటప్‌లో అందరినీ సర్‌ప్రైజ్ చేసాడు. ప్రస్తుతం తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తున్నాడు. ప్రేమఖైదీ, గజరాజు, రైలు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ‘హథీ మెరె సాథీ’ సినిమా చేస్తున్నాడు రానా. హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా రూపొందుతుంది.
రీసెంట్‌గా ఈ సినిమా లొకేషన్ నుండి రానా పిక్ ఒకటి లీక్ అయ్యింది. పొడవాటి లూజు షర్టు, తెల్ల వెంట్రుకలున్న గెడ్డం, రింగుల జుట్టు, కళ్ళజోడుతో డీ గ్లామర్ లుక్‌లో ఉన్నాడు. ఈ లుక్‌లో రానాని చూసిన వాళ్ళంతా షాక్ అవుతున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోయే ఈ సినిమాలో రానాకీ ఒక ఏనుగుకి మధ్య ఉండే రిలేషన్‌ని చక్కగా చూపించనున్నారట. ఏనుగులను మచ్చిక చేసుకోవడానికి రానా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. తెలుగులో రానా చెయ్యబోయే కొత్త సినిమా త్వరలో స్టార్ట్ కానుంది.